పురావస్తు తవ్వకాల్లో బయటపడిన 1600 ఏళ్ల నాటి మహా రాజు సమాధి.. శాస్త్రవేత్తలు విస్తూ పోయే సంపద..!

2010లో ఇక్కడ దొరికిన కొన్ని అబ్సిడియన్ బ్లేడ్‌లు, ఇతర కళాఖండాలు మెక్సికన్ నగరం టియోటిహువాకాన్ ప్రభావాన్ని చూపుతాయి. కానీ టె కబ్ చాక్ సమాధి మరింత పురాతనమైనది. ఆ సమయంలో ఈ ప్రాంత పాలకులు స్వదేశీ మాయన్లు అని రుజువు చేస్తుంది. ప్రొఫెసర్ అర్లాన్ చేజ్ వివరాల మేరకు మెసోఅమెరికాలోని ఈ రెండు ప్రాంతాల పాలకులు ఒకరి మత సంప్రదాయాల గురించి ఒకరు తెలుసుకోవడమే కాకుండా, అధికారిక దౌత్య సంబంధాలను కూడా కలిగి ఉండవచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు.

పురావస్తు తవ్వకాల్లో బయటపడిన 1600 ఏళ్ల నాటి మహా రాజు సమాధి.. శాస్త్రవేత్తలు విస్తూ పోయే సంపద..!
Ancient Tomb

Updated on: Jul 16, 2025 | 4:38 PM

అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ బృందానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు వేల సంవత్సరాల నాటి ఆస్తిని గుర్తించారు. ఒక పురాతన నగరానికి పునాది వేసిన పాలకుడి రాజ సమాధిని కనుగొన్నారు. 1,600 సంవత్సరాల క్రితం పురాతన మాయన్ నగరమైన కారకోల్‌ను స్థాపించిన చక్రవర్తి టేక్ అబ్ చాక్ సమాధిని కనుగొన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. జూలై 10న హ్యూస్టన్ విశ్వవిద్యాలయ బృందం దీనిని అధికారికంగా ప్రకటించింది. విశ్వవిద్యాలయ పురావస్తు శాస్త్రవేత్తలు ఆర్లెన్ చేజ్, డయాన్ చేజ్ 40 సంవత్సరాల క్రితం అక్కడ తవ్వకాలు ప్రారంభించారని, అప్పటి నుండి మొదటిసారిగా కారకోల్‌లో గుర్తింపు పొందిన రాజ సమాధి వెలుగులోకి వచ్చిందని వెల్లడించారు.

టె కాబ్ చాక్ 331 ADలో కారకోల్ మహరాజుగా సింహాసనాన్ని అధిష్టించారు. అతడి మరణానంతరం చేసిన ఈ సమాధి దాదాపు 350 AD నాటిదని భావిస్తున్నారు.. సమాధిలో గుర్తించిన విధంగా ఇక్కడ రాజు జీవితపు గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది. చక్రవర్తి టేక్ అబ్ చక్ రాజ జీవితానికి సంబంధించిన ఆధారాలు కూడా ఈ సమాధిలో గుర్తించారు శాస్త్రవేత్తలు. వీటిలో చెక్కబడిన ఎముకలు, సముద్రపు గవ్వలు, జాడేతో చేసిన మొజాయిక్ డెత్ మాస్క్, కుండలు, గొట్టపు జాడే పూసలు ఉన్నాయి.

6వ, 7వ శతాబ్దాలలో కారకోల్ నగరం మాయన్ ప్రపంచానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. ఈ నగరం ఒకప్పుడు 10,000 మందికి పైగా నివసించేది. కానీ, 900 AD నాటికి ఇది అనేక ఇతర మాయన్ నగరాల మాదిరిగానే రహస్యంగా కూలిపోయింది. దీని శిథిలాలు ఇప్పటికీ బెలిజ్‌లోని కాయో జిల్లాలోని పర్వత అడవులలో ఉన్నాయి. కారకోల్ నగరం 68 చదరపు మైళ్లకు పైగా విస్తరించి ఉంది. టెర్రస్డ్ పొలాలు, విస్తారమైన రోడ్డు మార్గాలు, గంభీరమైన భవనాలు, 140 అడుగుల ఎత్తైన కానా పిరమిడ్ వంటి నిర్మాణాలతో ఇది నేటికీ బెలిజ్‌లోని ఎత్తైన భవనాలలో ఒకటిగా ఉంది.

ఇవి కూడా చదవండి

మెక్సికోతో సంబంధం ఏమిటి?