Viral Video: యువకుడి ట్యాలెంట్‌కు ఆనంద్‌ మహీంద్ర ఫిదా.. ఐప్యాడ్‌తో అద్భుత సంగీతం.

|

Mar 15, 2024 | 7:37 PM

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్‌ మీడియా గురించి కాస్త పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ పేరు సుపరిచతమే. ప్రపంచంలో ఎక్కడ ఆసక్తికర విషయాలు జరిగినా వెంటనే సోషల్‌ మీడియాలో పంచుకోవడం ఆనంద్‌ మహీంద్రకు అలవాటు. రకరకాల వీడియోలను...

Viral Video: యువకుడి ట్యాలెంట్‌కు ఆనంద్‌ మహీంద్ర ఫిదా.. ఐప్యాడ్‌తో అద్భుత సంగీతం.
Anand Mahindra Viral Video
Follow us on

ఒకప్పుడు మనలోని ప్రతిభ నలుగురికి తెలియాలంటే చాలా సమయం పట్టేది. అయితే ఎప్పుడైతే సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిందో అప్పటి నుంచి ప్రపంచంలో ఎక్కడ ఏ ట్యాలెంట్‌ ఉన్నా క్షణాల్లో అందరికీ తెలిసిపోతోంది. తమ ప్రతిభకు సంబంధించిన వీడియోను ఇలా పోస్ట్ చేయగానే అలా నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇలాంటి ప్రతిభకు సంబంధించిన వీడియోలు సైతం తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్‌ మీడియా గురించి కాస్త పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ పేరు సుపరిచతమే. ప్రపంచంలో ఎక్కడ ఆసక్తికర విషయాలు జరిగినా వెంటనే సోషల్‌ మీడియాలో పంచుకోవడం ఆనంద్‌ మహీంద్రకు అలవాటు. రకరకాల వీడియోలను షేర్‌ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకునే ఆనంద్‌ మహీంద్ర తాజాగా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను తన ఎక్స్‌ ఖాతా ద్వారా షేర్‌ చేశారు.

సాధారణంగా సంగీతం వాయించాలంటే అందుకు అవసరమైన సంగీత వాయిద్యాలు ఉండాలి. అలాకాకుండా ఐప్యాడ్‌లో ఉండే యాప్స్‌ ద్వారా సంగీతాన్ని వాయిస్తే ఎలా ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! అయితే దీనిని మహేష్‌ రాఘవన్‌ అనే ఓ యువకుడు నిజం చేసి చూపించాడు. అవలీలగా ఐప్యాడ్‌పై సంగీతాన్ని వాయించాడు. దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర.. ‘మహేష్ రాఘవన్ ప్రతిభను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఐప్యాడ్‌ సాయంతో అద్భుతమైన సంగీతాన్ని వినిపిస్తున్నాడు. భారతీయులకు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందు వరుసలో ఉంటారు’’ అని రాసుకొచ్చారు.

ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసిన వీడియోపై మహేష్‌ స్పందించారు. తన వీడియోను షేర్‌ చేసినందుకు ఆనంద్‌ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపారు. దీనికి ఆనంద్‌ మహీంద్ర బదులిస్తూ.. ‘నేర్చుకోవడంపై మీకున్న శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తోంది’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..