ప్రపంచంలో జరుగుతున్న ఆసక్తికరమైన విషయాల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే వ్యాపారవేత్తలలో ఆనంద్ మహీంద్రా ఒకరు. అతని సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ కూడా ఉంది. మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఆసక్తికరమైన వీడియోలు, పోస్ట్‌లు చేస్తూ తన 10 మిలియన్లకు పైగా ట్విట్టర్ ఫాలోవర్లను ఆశ్చర్యపరుస్తుంటారు. అలాగే ఒక్కోసారి తనకు పెట్టిన పోస్టుల్లో ఉన్న వారికి సాయం చేసేందుకు కూడా ముందుకు వస్తుంటారు. కొందరు ప్రతిభావంతులైన నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. అయితే, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఒకసారి మహీంద్ర కారు స్టీరింగ్ పట్టుకుని ఉన్న ఒక చిన్నారి ఫోటోను షేర్ చేశారు. 7 ఏళ్ల క్రితం ఈ ఫోటోను షేర్ చేశారు.
ఇక ఇప్పుడు అదే చిన్నారి కాస్త పెద్దదై ఆనంద్ మహీంద్రాను కలవడమే కాకుండా అతనితో పరిచయం పెంచుకుంది. మీరు షేర్ చేసిన ఫోటోలోని అమ్మాయిని నేనే అని చెప్పింది. ఆనంద్ మహీంద్రా ఈ అందమైన క్షణం ఫోటోను ట్విట్టర్‌లో మళ్లీ షేర్ చేశారు.
Yesterday evening, this charming young lady, Rhea, came up to me & reminded me I had tweeted a pic of her seven years ago, when she was a year old! Thank you @Gaurishrulz for sharing that tweet. The countdown continues. I, too, can’t wait for her to get behind the wheel (and… pic.twitter.com/n0LmilWqqN
— anand mahindra (@anandmahindra) June 11, 2023
చిన్నారి రియా తనకు ఏడాది వయసున్నప్పుడు ఆమె ఫోటోను ట్వీట్ చేశానని నాకు గుర్తు చేసింది. ఆ ట్వీట్‌ను షేర్ చేసిన గౌరీష్‌కి (Gaurish Lad) ధన్యవాదాలు’ అనే శీర్షికతో ఆయన రాసుకొచ్చిన ట్వీట్ వైరల్ అవుతోంది. ట్విట్టర్‌లో గతంలో తను రియా కోసం పోస్ట్ చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్‌తో పాటు.. తాజాగా రియాతో తాను దిగిన ఫోటోను ఆనంద్ మహీంద్ర షేర్ చేసుకున్నారు. వీరి కలయిక అందమైన క్షణం అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా, మాకు మిమ్మల్ని కలిసే అవకాశం ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నాం అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. ఆనంద్ మహీంద్రాను వ్యక్తిగతంగా కలవడం సంతోషంగా ఉందన్నారు రియా కుటుంబ సభ్యులు.
ఈ పోస్ట్‌ను 3 లక్షల మందికి పైగా వీక్షించారు. పలువురు కామెంట్ చేశారు. తదుపరి ఆమె ఖచ్చితంగా మహీంద్రా కారును కొనుగోలు చేస్తుందని ఒక ప్రేక్షకుడు వ్యాఖ్యానించాడు. మీ దయ, కరుణకు పెద్ద వందనం’’ అని మరొకరు వ్యాఖ్యానించారు. మా ఉత్పత్తిని కొనుగోలు చేసేందుకు కస్టమర్ల కోసం ప్రజలు ఎప్పుడూ ఎదురుచూస్తారని.. కానీ మీ కస్టమర్లు మీ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి :