ఎవర్రా మీరంతా.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారు!..ఆనంద్ మహీంద్రాకు షాకిచ్చిన వీడియో..! ఇంటర్‌నెట్‌లో వైరల్‌..

|

Jan 03, 2024 | 7:59 PM

ఆనంద్ మహీంద్రా స్వయంగా ఈ వీడియోను తన అధికారిక X ఖాతా ద్వారా షేర్‌ చేశారు. దీనిపై వేలాది మంది లైక్‌లు, పలు రకాల స్పందనలు వ్యక్తం చేశారు. ఈ నైపుణ్యం, అంకితభావం అద్భుతమైనదిగా ఒక వినియోగదారు రాశారు. మరొక వినియోగదారు రాశారు ఇది అద్భుతమైనది అంటూ.. చిన్న చిన్న వ్యాపారుల్లోనూ గొప్ప ప్రతిభను, సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని మరికొందరు వ్యాఖ్యానించారు..

ఎవర్రా మీరంతా.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారు!..ఆనంద్ మహీంద్రాకు షాకిచ్చిన వీడియో..! ఇంటర్‌నెట్‌లో వైరల్‌..
Street Vendors Bartending Skills
Follow us on

మీలో చాలా మందికి కాక్‌టెయిల్‌ల గురించి తెలిసే ఉంటుంది. కొందరికైతే.. వాటిని తాగడం కూడా తెలుసు. ప్రపంచంలో కాక్టెయిల్ తాగడానికి ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. మరోవైపు ఇష్టపడని వారు కూడా ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఫ్యామిలీ రెస్టారెంట్, బార్‌కి వెళ్లి ఉంటే లేదా సినిమాల్లో తరచుగా చూసినట్టుగా బార్ టెండర్‌లు ఎంతో క్రియేటివిటితో కాక్‌టెయిల్‌లను తయారు చేస్తుంటారు. వీటిని చూసి జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. బార్ టెండర్లు దాని కోసం ఎంతో సాధన చేస్తారు. అయితే, వీధిలో సాధారణ జ్యూస్ విక్రేత నుండి కాక్‌టెయిల్‌ను తయారు చేసే ప్రత్యేకమైన విధానాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? ఐతే ఈ వైరల్ వీడియోలో అలాంటిదే కొందరు యువకుల అద్భుతమైన టాలెంట్‌ కనిపించింది. ఈ వీడియోని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు.

వీడియోలో ఒక జ్యూస్ విక్రేత అద్భుతమైన టెక్నిక్‌ని ఉపయోగించి కాక్‌టెయిల్‌ను తయారు చేస్తున్నాడు. అది చూసిన తర్వాత మీరు కూడా ఆయన అభిమాని అవుతారు. అతను కాక్‌టెయిల్ గ్లాస్‌ని గాలిలోకి విసిరి, టేబుల్‌ని కొట్టే విధానాన్ని చూసి మీరు ఖచ్చితంగా షాక్‌ అవుతారు.. కాగా, ఈ వీడియో వైరల్‌గా మారటంతో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఈ యువకుడికి వీరాభిమానిగా మారారు. వీడియోలో, కాక్టెయిల్ తయారీలో యువకుడి కళాత్మకత,నైపుణ్యం కనిపించింది. అతను ఒక గ్లాసు నిండుగా కాక్‌టెయిల్‌లను నింపి.. దాన్ని గాలిలోకి విసిరి, ఆపై ఎంతో శిక్షణ పొందిన బార్ టెండర్ లాగా తన చేతులతో దాన్ని బ్యాలెన్స్ చేస్తాడు. ఈ వ్యక్తి బార్ టెండర్ కాదని ఆనంద్ మహీంద్రా చెప్పారు. కానీ అతనిలో చాలా టాలెంట్ ఉంది. ఈ వీడియో సీన్ న్యూ ఇయర్ ఈవ్ పార్టీలో అని కూడా చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఆనంద్ మహీంద్రా స్వయంగా ఈ వీడియోను తన అధికారిక X ఖాతా ద్వారా షేర్‌ చేశారు. దీనిపై వేలాది మంది లైక్‌లు, పలు రకాల స్పందనలు వ్యక్తం చేశారు. ఈ నైపుణ్యం, అంకితభావం అద్భుతమైనదిగా ఒక వినియోగదారు రాశారు. మరొక వినియోగదారు రాశారు ఇది అద్భుతమైనది అంటూ.. చిన్న చిన్న వ్యాపారుల్లోనూ గొప్ప ప్రతిభను, సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని మరికొందరు వ్యాఖ్యానించారు.. వారికి కావలసిందల్లా సరైన తోడ్పాటు, సరైన మార్గదర్శకత్వం. నైపుణ్యం కలిగిన బార్ టెండర్ కంటే కూడా ఇక్కడ యువకుడి టాలెంట్‌ అద్వితీయంగా ఉందన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..