ఫన్నీ డ్యాన్స్…  ఆనంద్‌ మహీంద్రా ట్వీట్!

| Edited By:

Aug 20, 2019 | 7:03 AM

ఆసక్తికరమైన ట్వీట్లు చేయడంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా ఆయన ఓ వీడియోను పోస్టు చేశారు. అమెరికాకు చెందిన కమేడియన్‌ క్యూపార్క్‌ మన బాలీవుడ్‌ స్టార్ల స్టెప్పులను ఇమిటేట్ చేస్తున్న వీడియోను పోస్టు చేశారు. న్యూయార్క్‌లోని బాగా రద్దీగా ఉన్న ప్రదేశంలో ఆయన వచ్చీ రాని స్టెప్పులేయడం నవ్వులు పూయిస్తోంది. ఫేమస్‌ బాలీవుడ్‌ పాటలైన ‘ఛోళీ కే పీచే’, ‘ ధూమ్‌ మచాలే’, ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’ వంటి […]

ఫన్నీ డ్యాన్స్...  ఆనంద్‌ మహీంద్రా ట్వీట్!
Follow us on

ఆసక్తికరమైన ట్వీట్లు చేయడంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా ఆయన ఓ వీడియోను పోస్టు చేశారు. అమెరికాకు చెందిన కమేడియన్‌ క్యూపార్క్‌ మన బాలీవుడ్‌ స్టార్ల స్టెప్పులను ఇమిటేట్ చేస్తున్న వీడియోను పోస్టు చేశారు. న్యూయార్క్‌లోని బాగా రద్దీగా ఉన్న ప్రదేశంలో ఆయన వచ్చీ రాని స్టెప్పులేయడం నవ్వులు పూయిస్తోంది. ఫేమస్‌ బాలీవుడ్‌ పాటలైన ‘ఛోళీ కే పీచే’, ‘ ధూమ్‌ మచాలే’, ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’ వంటి పాటల్లోని స్టెప్పులను క్యూపార్క్‌ అనుకరించారు. ఈ వీడియో పాతదే అయినా మహీంద్రా షేర్‌ చేయడంతో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌ పాటలకు ఇలా కూడా స్టెప్పులేయవచ్చని తమకు తెలీదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.