Viral Video: రెస్టారెంట్‌లా మారిన ఫుడ్ ట్రక్.. ఆనంద్ మహీంద్రా షాక్!

ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన బిజినెస్‌లో ఎంత ఫేమస్సో.. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన మనసును హత్తుకున్న వీడియోలను ఆయన కూడా నెటిజన్స్‌తో పంచుకుంటారు. అంతే కాకుండా తనదైన శైలిలో వాటికో క్యాప్షన్ కూడా ఇస్తారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఏ వీడియో అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది. లక్షల్లో వ్యూస్‌ని సంపాదించుకుంటుంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వీడియోను..

Viral Video: రెస్టారెంట్‌లా మారిన ఫుడ్ ట్రక్.. ఆనంద్ మహీంద్రా షాక్!
Viral Video

Updated on: Feb 21, 2024 | 4:18 PM

ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన బిజినెస్‌లో ఎంత ఫేమస్సో.. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన మనసును హత్తుకున్న వీడియోలను ఆయన కూడా నెటిజన్స్‌తో పంచుకుంటారు. అంతే కాకుండా తనదైన శైలిలో వాటికో క్యాప్షన్ కూడా ఇస్తారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఏ వీడియో అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది. లక్షల్లో వ్యూస్‌ని సంపాదించుకుంటుంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వీడియోను తన x ఖాతా నుంచి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్ హల్చల్ చేస్తుంది. ఓ ఫుడ్ ట్రక్‌.. రెస్టారెంట్‌గా ఎలా మారిందో చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇంతకీ వీడియోలో ఏముందంటే..

ఓ చిన్న ఫుడ్ ట్రక్.. ఓ రోడ్డు చివర ఆగింది. అందులో నుంచి బయటకు వచ్చిన ఓ వ్యక్తి.. దాన్ని క్షణాల్లోనే రెస్టారెంట్‌గా మార్చేశాడు. ప్రస్తుతం ఉన్న ఆధునిక టెక్నాలజీని ఆ వ్యక్తి ఎంతో బాగా యూజ్ చేసున్నాడు. ఈ ఫుడ్ ట్రక్ రెస్టారెంట్ కేవలం ఒకే దగ్గర ఉండాల్సి పని లేదు. ఎక్కడ మార్కెట్ ఎక్కువగా ఉంటే అక్కడకు మార్చుకోవచ్చు. దీని వల్ల వ్యాపారస్తుడికి లాభం కూడా చేకూరుతుంది. ఆ వ్యాపారస్తుడి సృజనాత్మకతకు ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయ్యాడు. వెంటనే ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మనసు ఉంటే మార్గం ఉంటుందని ఊరికే అనలేదు పెద్దలు. కష్ట పడాలి అనుకుంటే ఎన్నో దారులు ఉంటాయి.

‘ఫాస్ట్ ఫుడ్.. ఫాస్ట్ ట్రక్స్.. ఇప్పుడు ఫాస్ట్ రెస్టారెంట్స్. ఈ న్యూ బిజినెస్ ఐడియా చాలా బావుంది. ఈ రెస్టారెంట్ ఒకే స్థానంలో ఉండాల్సిన పనిలేదు. ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడకు వెళ్లొచ్చు’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటెర్నెట్‌ని షేక్ చేస్తుంది. వ్యాపారస్తుని ఐడియాకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ఈ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రాను కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.