Viral Video: చర్చిలో బంగారం దోచుకెళ్లిన ప్రబుద్ధుడు.. సీన్ చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్..

Stole gold jewelery from a Church: పండగ పూట అందరూ సెలబ్రేషన్ మూడ్ లో ఉంటే.. ఓ దొంగ మాత్రం అదను చూసి వేటు వేశాడు. ఏం తెలియనట్లు చర్చిలోకి ప్రవేశించిన యువకుడు.. పెద్ద ఎత్తున బంగారం

Viral Video: చర్చిలో బంగారం దోచుకెళ్లిన ప్రబుద్ధుడు.. సీన్ చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్..
Crime News

Updated on: Oct 15, 2021 | 9:53 AM

Stole gold jewelery from a Church: పండగ పూట అందరూ సెలబ్రేషన్ మూడ్ లో ఉంటే.. ఓ దొంగ మాత్రం అదను చూసి వేటు వేశాడు. ఏం తెలియనట్లు చర్చిలోకి ప్రవేశించిన యువకుడు.. పెద్ద ఎత్తున బంగారం దొచుకెళ్లాడు. తమిళనాడులోని కన్యాకుమారిలో ఓ చర్చిలో దొంగ చేసిన పనితో అందరూ షాక్ అయ్యారు. కన్యాకుమారి జిల్లాలోని తమిళనాడు-కేరళ సరిహద్దులోని కలియక్కవిలై బస్టాండ్‌లో దగ్గర సెయింట్ ఆంథోనీ చర్చి ఉంది. ఈ చర్చిలోకి ఓ ప్రబుద్ధుడు.. భుజాన బ్యాగ్ వేసుకుని ప్రవేశించాడు. దేవుడి మీద భక్తితోనో.. ప్రేయర్ చేయడం కోసమో వచ్చాడో అనుకున్నారంటే.. పొరబడినట్టే.. ఆ ప్రభువునే నిలువునా దోపిడీ చేయడానికి వచ్చిన కేటుగాడని వీడియో మొత్తం చూస్తే అర్ధం అవుతుంది.

చర్చిలోకి ప్రవేశించిన దొంగ.. విగ్రహాలకు ఉన్న బంగారంపై కన్నేశాడు. ఫ్లోర్ క్లీన్ చేసే కర్రతో గాజులను బలంగా కొట్టాడు. ఒక్క దెబ్బతో గాజు అద్దం మొత్తం పగిలిపోయింది. అనంతరం విగ్రహాలకు ఉన్న బంగారం ఆభరణాలను తీసుకొని దొంగ ఉడాయించాడు. ఈ ఘటన అంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీని ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు కన్యాకుమారి పోలీసులు తెలిపారు. కాగా.. ఈ దోపిడీ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది.

వీడియో.. 

Also Read:

Crime news: పండగ పూట పరేషాన్.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు..

Crime News: సముద్ర తీరంలో యువతి శవం.. ప్రియుడు అరెస్ట్‌.. ఏపీలో కలకలం..