Watch: పిల్ల జీబ్రా ప్రేమ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..! నెట్టింట వీడియో వైరల్

ఒక పిల్ల జీబ్రా, దాని కేర్‌టేకర్ మధ్య చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిది. దాన్ని చూసిన జనం భావోద్వేగానికి గురవుతున్నారు. కెన్యాలో గాయపడిన స్థితిలో ఉన్న పిల్ల జీబ్రాను చేరదీసి సరక్షిస్తున్నారు. ఈ శిశువు జీబ్రా సంరక్షకుడిని తన తల్లిలా భావిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Watch: పిల్ల జీబ్రా ప్రేమ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..! నెట్టింట వీడియో వైరల్
Zebra And Caretaker

Updated on: Sep 12, 2025 | 5:22 PM

కెన్యాకు చెందిన షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక హృదయ విదారక వీడియోను షేర్ చేసింది. ఇందులో ఒక జీబ్రా తన కేర్‌టేకర్‌తో కలిసి కనిపించింది. ఒక కేర్‌టేకర్ తన తల్లి ప్రేమను శిశువు జీబ్రాకు పంచడానికి ఆయన చూపిన చొరవ అందరి హృదయాలను హత్తుకునేలా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లక్షలాది మంది నెటిజన్లు ఈ వీడియో చూసి చలించిపోయారు.

ఈ వైరల్ వీడియోలో, ‘బాంబి’ అనే జీబ్రా పిల్ల తన సంరక్షకులు పీటర్‌ను పట్టుకుని వేలాడుతూ కనిపించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో బాంబి తల్లిని సింహాలు చంపివేశాయి. దీంతో ఒంటరిగా మారిన పిల్ల జీబ్రాను రక్షించారు. దాన్ని ట్రస్ట్‌కు తీసుకువచ్చారు. తీవ్రంగా గాయపడిన పిల్ల జీబ్రాకు 24 గంటలూ సంరక్షణ అవసరం. దీంతో కేర్ టేకర్ పీటర్‌కు పిల్ల జీబ్రా బాధ్యతలు అప్పగించారు.

కేర్ టేకర్ పీటర్ జీబ్రా నమూనాతో కూడిన ప్రత్యేక కోటును ధరించాడు. తద్వారా బాంబి అనే పిల్ల జీబ్రా.. తన తల్లిలాగా భావించింది. జీబ్రా పిల్లలు తమ తల్లి చారల నమూనాను గుర్తిస్తాయి. కాబట్టి, బాంబికి పీటర్‌తో సాయం చేయడంలో ఎటువంటి సమస్య రాలేదు. ఇప్పుడు బాంబి అతన్ని తన తల్లిగా భావిస్తుందని షెల్డ్రిక్ ట్రస్ట్ ప్రతినిధి తెలిపారు. మాతృ ప్రేమను పొందుతున్న బాంబికి సంబంధించి వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అదీకాస్త వైరల్‌గా మారింది.

@sheldricktrust ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 3 లక్షలకు పైగా వీక్షించారు. ఈ వీడియో చూసిన తర్వాత జనం చాలా భావోద్వేగానికి గురవుతున్నారు. కామెంట్స్ విభాగంలో తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి:

ఒక యూజర్, బాంబి-పీటర్ ఇద్దరూ చాలా ముద్దుగా ఉన్నారని వ్యాఖ్యానించారు. మరొక యూజర్, బాంబి పీటర్‌ను చాలా ప్రేమిస్తున్నాడని అన్నారు. మరొక యూజర్, చాలా ముద్దుగా ఉన్న వీడియో రాశారు. అది హృదయాన్ని తాకింది అంటూ పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..