Eye Test: ఈ ఫోటోలో దాగి ఉన్న నంబర్స్ ఏంటో గుర్తిస్తే మీ ఐ పవర్ కిర్రాక్ అంతే.. చాలా టఫ్ పజిల్

ఈ మధ్య సోషల్ మీడియాలో పజిల్స్‌ను నెటిజన్స్ బాగా లైక్ చేస్తున్నారు. తమ ఐ పవర్, ఐక్యూ పవర్ టెస్ట్ చేసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారు. అలాంటి వారి కోసం చక్కటి పజిల్.

Eye Test: ఈ ఫోటోలో దాగి ఉన్న నంబర్స్ ఏంటో గుర్తిస్తే మీ ఐ పవర్ కిర్రాక్ అంతే.. చాలా టఫ్ పజిల్
Eye Test

Updated on: Aug 01, 2022 | 9:16 AM

Optical illusion: ఆప్టికల్ ఇల్యూషన్ మనల్ని మాయ చేస్తాయి. మనతో ఓ ఆట ఆడేసుకుంటాయి. అందులో ఉన్నది ఏంటో కనిపెట్టడం చాలా కష్టమైన టాస్క్. ఐ పవర్ అద్భుతంగా ఉన్నవారు వీటిని ఈజీగా సాల్వ్ చేయగలరు. ఒకప్పుడు వయసు బాగా మీద పడిన తర్వాత సైట్ వచ్చేది.. కానీ మారిన జీవన విధానం వల్ల తక్కువ వయసులో కళ్లద్దాలు వచ్చేస్తున్నాయి. సైట్ బారి నుంచి విముక్తి పొందడానికి చాలామంది ఐ లెన్స్ పెట్టుకోవడం, లేజర్ ట్రీట్‌మెంట్ తీసుకోవడం వంటివి మనం చూస్తేనే ఉన్నాం. చూడగానే మనకి ఒకటి కనిపిస్తుంది. అందులో దాగి ఉండేది మాత్రం మరొకటి. కణికట్టు మాయాజాలం అంటారు చూశారు. ఈ ఫోటోలు అలాంటివే. ఈ తరహా చిక్కు పజిల్స్ సాల్వ్ చేసేందుకు నెటిజన్స్ ఈ మధ్య బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. మన మెదడు సామర్థ్యాన్ని కూడా ఇవి నిర్ణయిస్తాయి. తాజాగా అలాంటి ఓ పజిల్ ఫోటోను మీ కోసం తీసుకొచ్చాం. మీరు పైన చిత్రంలో దాగి ఉన్న సంఖ్యను కనిపెట్టాల్సి ఉంటుంది. చాలామంది ఈ నంబర్లను గుర్తించడంలో తికమక పడుతున్నారు. ఫోన్‌ను అటు ఇటూ వంటి అందులో దాగి ఉన్న సంఖ్యలను గుర్తించేందుకు తెగ కష్టపడిపోతున్నారు. సో మీరు కూడా కొన్ని నంబర్స్ ఫిక్సయిపోయి ఉంటారు కదా…? అవి కరెక్టో, కాదో దిగువన ఇవ్వబోయే ఆన్సర్‌తో చెక్ చేసుకోండి.

ముందుగానే చెప్తున్నాం ఆన్సర్ గుర్తించకపోతే హైరానా పడిపోవద్దు. ఎందకంటే ఇది చాలా టఫ్ పజిల్. 100లో 90 మంది ఆన్సర్ గుర్తించలేకపోయారు. ఇక అందులో దాగి ఉన్న సంఖ్యలు ఏంటి అంటే.. 3246. ఇప్పుడు ఒక్కసారి పరీక్షగా చూడండి. మీకు ఆ నంబర్స్ కనిపిస్తాయి. ఈ పజిల్ మీకు నచ్చింది కదూ..!

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..