ఆకాశంలో చేపలాగా ఎగిరిన విమానం.. అమాంతం నేలపై పడింది..25మందికి గాయాలు..

విమాన ప్రయాణం అంటేనే ప్రజలు భయపడేలా కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. తరచూ ఏదో ఒక చోట ఏదో ఒక విమాన ప్రమాదం, సాంకేతిక లోపం వంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో విమానానికి సంబంధించి షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. గాల్లో ఉండగా ఒక విమానం ఆకాశంలో చేపలాగా ఎగిరింది. తరువాత నేలపై పడింది. ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారని తెలిసింది. దీంతో సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఆకాశంలో చేపలాగా ఎగిరిన విమానం.. అమాంతం నేలపై పడింది..25మందికి గాయాలు..
Delta Flight

Updated on: Jul 31, 2025 | 12:23 PM

డెల్టా విమానం ఆకాశంలో ఉండగా తీవ్ర అల్లకల్లోలాన్ని ఎదుర్కొంది. సాల్ట్ లేక్ సిటీ నుండి ఆమ్స్టర్డామ్ వెళ్తున్న డెల్టా ఎయిర్లైన్స్ విమానం తీవ్ర కుదుపులకు గురైంది.. ఈ అల్లకల్లోలం చాలా భయంకరంగా ఉండటంతో విమానంలోని 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, విమానాన్ని మిన్నియాపాలిస్-సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు మళ్లించారు. గాయపడిన 25 మంది ప్రయాణికులను స్థానిక ఆసుపత్రిలో చేర్చారు.

బుధవారం జరిగిన ఈ సంఘటనపై అధికారులు సమీక్షిస్తున్నారు. సాంకేతిక లోపం కారణంగా విమానంలో ఏర్పడిన అల్లకల్లోలంతో  ప్రయాణికులకు  గాయాలు అవుతున్నాయి.. కానీ, వాతావరణ మార్పు జెట్‌ స్రీమ్‌ నమూనాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి, అవి తరచుగా సంభవించవచ్చని నిపుణులు అంటున్నారు.

మే 2024లో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో తీవ్ర అల్లకల్లోలం ఎదురవుతుండగా ఒక వ్యక్తి మరణించాడు. అనేక దశాబ్ధాల తరువాత ఒక ప్రధాన విమానయాన సంస్థలో అల్లకల్లోలం కారణంగా జరిగిన మొదటి మరణం ఇది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి