సెక్స్ కోరికలను పెంచేందుకు, లైంగిక సమస్యలు ఉన్నవారు వయాగ్రాను వాడుతుండటం సర్వసాధారణం. అయితే ఆ దేశంలో వయాగ్రాను కాస్తా బ్యాన్. దీంతో తమ లైంగిక శక్తిని పెంచుకునేందుకు కొందరు పురుషులు కొత్తగా తయారు చేసిన కామోద్దీపన వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదంతా జరిగే మరెక్కడో కాదండీ.. మన దాయాది దేశం పాకిస్తాన్‌లో.. ఇంతకీ అదేంటని అనుకుంటున్నారా.? లేట్ ఎందుకు ఈ స్టోరీ చదివేయండి.
వివరాల్లోకి వెళ్తే.. వయాగ్రా బ్యాన్ కావడంతో పాకిస్తాన్‌లోని కొంతమంది పురుషులు తమ లైంగిక శక్తిని పెంపొందించేందుకు కొత్త కామోద్దీపన వైపు మొగ్గు చూపుతున్నారు. మరీ ముఖ్యంగా రావల్పిండిలో నివాసముంటున్న పురుషులు ఈ పని చేస్తున్నారు. హార్డ్‌విక్ స్పైనీ-టెయిల్డ్ బల్లి కొవ్వు, స్కార్పియాన్ ఆయిల్‌తో పాటు సండా టెల్ అనే ఘాటైన ఎరుపు మసాలాతో తయారు చేసిన ‘గొర్రెల్లా బల్లి నూనె’ కోసం ఎగబడుతున్నారు రావల్పిండి పురుషులు. బల్లి కొవ్వుతో చేసిన నూనె లైంగిక శక్తిని పెంచుతుందని ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకపోయినప్పటికీ.. పాక్ ప్రజలు దాని కోసం క్యూ కడుతున్నారు. ఆ ఆయిల్‌తో తమ ప్రైవేటు పార్ట్‌ను మసాజ్ చేయడం ద్వారా లైంగిక శక్తి పెరుగుతుందని యాసిర్ అలీ అనే స్థానికుడు చెబుతున్నాడు.
రాజస్థాన్‌లో భారతీయ స్పైనీ-టెయిల్డ్ బల్లి లేదా ‘సండా’ అని పిలవబడే ఈ సరీసృపాలను పాకిస్తానీ ప్రాంతాలైన పంజాబ్, సింధ్‌లలో వేటాడుతుంటారు. అవి సూర్యరశ్మి కోసం దాని బొరియ నుంచి బయటకు వచ్చినప్పుడు.. వేటగాళ్ళు వేటాడుతుంటారు. ఇస్లామాబాద్ సమీపంలోని ఒక గ్రామానికి చెందిన ముహమ్మద్ నాసిర్ అనే వేటగాడు మాట్లాడుతూ.. ‘ఈ బల్లులను ఫిషింగ్ వైర్ వలతో వేటాడిన తర్వాత వాటి వీపును విరగ్గొడతాం. లేదంటే అవి బులెట్ కంటే స్పీడ్‌గా పారిపోతాయి’ అని చెప్పుకొచ్చాడు.
కాగా, పాకిస్తాన్‌లో జంటలు పెద్ద కుటుంబాలను ప్లాన్ చేయాలని సామాజిక ఒత్తిడి ఉంది. మగవారిలో వంధ్యత్వం అనేది కళంకంగా భావిస్తారు. అలాగే వయాగ్రా అక్కడ చట్టవిరుద్ధం. ఇక ఇప్పుడు వారు ఈ బల్లి కొవ్వుతో చేయబడిన ఆయిల్‌ను కొత్త కామోద్దీపనగా విశ్వసిస్తున్నారు. అయితే ఇది లైంగిక శక్తిని పెంపొందిస్తుందని ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు.(Source)