Sania Mirza-Shoaib Malik: సానియా, షోయబ్ విడాకుల విషయంలో ఫుల్ క్లారిటీ.. ఇది మాత్రం అస్సలు ఊహించలేదు

వారు విడిపోయారు. వేరుగా ఉంటున్నారు కూడా అన్నారు. ఇక విడాకులు రావడమే లేటు అని కథనాలు అల్లారు. కానీ ఆ జంట ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఆ వివరాలు...

Sania Mirza-Shoaib Malik: సానియా, షోయబ్ విడాకుల విషయంలో ఫుల్ క్లారిటీ.. ఇది మాత్రం అస్సలు ఊహించలేదు
Shoaib Malik and Sania Mirza

Updated on: Nov 13, 2022 | 5:33 PM

టెన్నీస్‌ స్టార్‌ సానియా మిర్జా – షోయబ్‌ మాలిక్‌ దంపతుల విడాకుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌.. సంచలనం రేపుతోంది. త్వరలో ఇద్దరు కలిసి పాకిస్తాన్‌ టీవీలో టాక్‌షో నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ షోకు ‘మిర్జా మాలిక్‌ షో’ అని పేరు కూడా పెట్టారు. ఈ టాక్‌షో పోస్టర్‌ పాక్‌ చానెళ్లలో ప్రసారం అవుతోంది. సానియా మిర్జా -షోయబ్‌ మాలిక్‌ విడిపోయినట్టు ఇప్పటికే పాక్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ విడిపోయారని, చివరకు విడాకులు తీసుకున్నారని గత వారం రోజులుగా పుకార్లు వచ్చాయి. సానియా, షోయబ్ దీనిపై ఇంకా స్పందించలేదు. ఈ టాక్ షో పబ్లిసిటీ కోసమే ఈ స్టార్ కపుల్ ఇదంతా చేశారా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. శనివారం రాత్రి, OTT ప్లాట్‌ఫారమ్ ఉర్దుఫ్లిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో సానియా-షోయబ్ ‘ది మీర్జా మాలిక్ షో’లో కలిసి కనిపిస్తారని ప్రకటించింది.

పోస్టర్‌లో సానియా, షోయబ్‌ భుజంపై చేయి వేసి కనిపించింది. వెనుక ఉన్న విండోలో బుర్జ్ ఖలీఫాను కనిపిస్తుంది. ఈ జంట ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. ఇది చూసిన నెటిజన్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ‘ఇలా ఇద్దర్నీ చూడటం చాలా బాగుంది. కలిసే ఉండండి’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.“ ఏవైనా తప్పులు ఉంటే సర్దుకుని వెళ్లండి, మీ జంట చాలా అందంగా ఉంటుంది. షోయబ్‌ను వేరొకరితో చూడలేరు.. సానియా అతనికి సరైనది.” అని మరొకరు కామెంట్ పెట్టారు. అయితే సానియా లేదా షోయబ్ తమ సోషల్ హ్యాండిల్స్‌లో ఈ పోస్ట్‌ను షేర్ చేయకపోవడంతో సస్పెన్స్ అలానే కొనసాగుతుంది. ఈ క్రమంలో  టాక్‌షోలో సానియా – షోయబ్‌ మాలిక్‌ ఏం చెబుతారన్న విషయంపై ఆసక్తి నెలకొంది.

ఇండియా టెన్నిస్ స్టార్ సానియా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్‌లు 2010లో పెళ్లి చేసుకుని దుబాయ్‌లో కాపురం పెట్టారు. ఈ కపుల్‌కు 2018లో  కుమారుడు ఇజాన్‌  జన్మించాడు. వీరు విడాకులు తీసుకుంటున్నట్లు పాకిస్థానీ మీడియాలో తాజాగా కథనాలు వచ్చాయి. షోయబ్‌ను పాకిస్థానీ మోడల్ అయేషా ఒమర్‌తో డేటింగ్ చేస్తున్నాడని మరికొన్ని వెబ్‌సైట్స్ రాసుకొచ్చాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు ఈ జంట మౌనం పాటించింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..