AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా కంటే ఇండియానే బెస్ట్‌..! ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. సాక్ష్యాత్తు అమెరికన్‌ మహిళ

అమెరికాకు చెందిన క్రిస్టెన్ ఫిషర్ అనే మహిళ నాలుగు సంవత్సరాల క్రితం భారతదేశంలో స్థిరపడింది. తన ఇటీవలి వీడియోలో, భారతీయ సంస్కృతి, ఆహారం, ప్రజల పట్ల తన అపారమైన ప్రేమను పంచుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతదేశం తన జీవితాన్ని ఎలా మార్చిందో ఆమె వివరించింది.

అమెరికా కంటే ఇండియానే బెస్ట్‌..! ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. సాక్ష్యాత్తు అమెరికన్‌ మహిళ
American Women In India
SN Pasha
|

Updated on: Jun 30, 2025 | 9:41 PM

Share

భారతదేశం వైవిధ్యభరితమైన దేశం. ప్రతి ప్రాంతానికి దాని స్వంత ఆచారాలు, సంప్రదాయాలు, దుస్తుల కోడ్, ఆహారపు అలవాట్లు ఉంటాయి. కానీ చాలా మంది విదేశీయులు భారతీయ ఆచారాలు, దుస్తుల కోడ్‌లను ఇష్టపడతారు. అలాంటి వారు భారతదేశాన్ని సందర్శించినప్పుడు మన దుస్తులు ధరించడానికి, మన ఆహారాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడతారు. అయితే ఇండియాను అమితంగా ఇష్టపడిన ఓ మహిళ ఏకంగా తన స్వస్థలాన్ని విడిచిపెట్టి నాలుగు సంవత్సరాల క్రితం భారతదేశంలో స్థిరపడింది. ఆ మహిళ పేరు క్రిస్టెన్ ఫిషర్. ఆమె అమెరికా పౌరురాలు. అయితే ఆమె తాజాగా పోస్ట్‌ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఆమె ఇండియాను ఎందుకు అంతగా ఇష్టపడుతుందో వివరించింది.

ఈ వీడియోను kristenfischer3 అనే ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలో క్రిస్టెన్ ఫిషర్ భారతదేశంలో అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నానని చెబుతుంది. నేను, నా కుటుంబం నాలుగు సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చాం. నాలుగు సంవత్సరాలలో నేను ఇక్కడ అద్భుతమైన వ్యక్తులను కలిశాను, అద్భుతమైన ప్రదేశాలను సందర్శించాను, వాటిని ఆస్వాదించాను. నేను ఇక్కడ విభిన్నమైన ఆహారాలు, రుచులను రుచి చూశాను. భారతదేశం నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని ఆమె చెప్పింది.

ఈ వీడియో లక్షా నలభై వేలకు పైగా వీక్షణలను పొందింది, ఒక వినియోగదారుడు USA తో పోలిస్తే భారతదేశం అత్యుత్తమమని అన్నారు. మీరు చెప్పింది వాస్తవం.. అని ఆమె రిప్లే ఇచ్చారు. విదేశీయులు భారతదేశాన్ని ఇష్టపడి ఇక్కడ నివసించడానికి రావడం నిజంగా సంతోషంగా ఉందని మరొకరు వ్యాఖ్యానించారు. ఇక్కడి ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాల పట్ల నాకు గర్వకారణం.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి