Viral: పొలం పనులు చేస్తుండగా బయటపడిన ట్రంక్ పెట్టె.. అనుమానమొచ్చి ఓపెన్ చేయగా.!

లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరి ఇంటి తలుపు తడుతుందో.? ఎవ్వరికీ తెలియదు. అదృష్టం వరించినప్పుడు.. కచ్చితంగా దాన్ని వదిలిపెట్టకూడదని అంటారు. సరిగ్గా ఓ రైతుకు ఇలా లక్కు తనకు తానుగా వచ్చి వరించింది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని కెంటుకీ రాష్ట్రానికి చెందిన ఓ రైతు తన పొలంలో పనులు చేస్తుండగా.. అతడికి ఓ భారీ శబ్దం వినిపించింది.

Viral: పొలం పనులు చేస్తుండగా బయటపడిన ట్రంక్ పెట్టె.. అనుమానమొచ్చి ఓపెన్ చేయగా.!
Representative Image

Updated on: Jul 28, 2023 | 4:46 PM

లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరి ఇంటి తలుపు తడుతుందో.? ఎవ్వరికీ తెలియదు. అదృష్టం వరించినప్పుడు.. కచ్చితంగా దాన్ని వదిలిపెట్టకూడదని అంటారు. సరిగ్గా ఓ రైతుకు ఇలా లక్కు తనకు తానుగా వచ్చి వరించింది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..?

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని కెంటుకీ రాష్ట్రానికి చెందిన ఓ రైతు తన పొలంలో పనులు చేస్తుండగా.. అతడికి ఓ భారీ శబ్దం వినిపించింది. ఇంతకీ అదేంటోనని.. మట్టిని తవ్వి చూడగా.. ఓ ట్రంక్ పెట్టె బయటపడింది. అతడికి అనుమానమొచ్చి అందులో ఏముందో చూస్తే మైండ్ బ్లాంక్ అయింది.

ఆ పెట్టెలోని బంగారం, వెండి నాణేలు మట్టి కొట్టుకుపోయి కనిపించాయి. అనంతరం వాటిని శుభ్రం చేయగా మెరిసిపోతూ కనిపించాయి. ఇవి 1840-63 కాలానికి చెందినవిగా తేలింది. వాటిపై ‘ఇన్ గాడ్ వి ట్రస్ట్’ అని రాయబడింది. ఈ వెండి, బంగారు నాణేలు 1861-1865 మధ్య రూపొందించబడినవి అంచనా. ఇక రైతుకు దొరికిన బంగారు నాణేలు సుమారు 700 ఉంటాయని తెలుస్తోంది. కాగా, ఈ పురాతన నిధిని స్వాధీనం చేసుకున్న ఆర్కియాలజీ సంస్థ ‘గ్రేట్ కెంటకీ హోర్డ్’ అని నామకరణం చేశారు. వీటిని మరికొద్ది రోజుల్లోనే వేలం వేస్తారట.