
పోలీసుల వివరాల ప్రకారం..
బలోత్రా సమీపంలోని జాతీయ రహదారి 25పై పోలీస్ వాహనం, ఓ కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ASP అరవింద్ విష్ణోయ్, ASI హుకమ్ సింగ్, కానిస్టేబుల్ అనిల్ చౌదరి, డ్రైవర్ కానిస్టేబుల్ దిలీప్ మేఘ్వాల్ సహా పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. దీంతో వారిని సమీపంలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు జోధ్‌పూర్‌లోని MDM హాస్పిటల్‌కు రెఫర్ చేశారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి పోలీసులు వారిని అంబులెన్స్ సహాయంతో జోధ్‌పూర్‌కు తరలించారు.
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 12, 2025
ఈ క్రమంలో MDM ఆసుపత్రి వద్దకు చేరుకోగానే నియంత్రణ కోల్పోయిన అంబులెన్స్ డ్రైవర్ హాస్పిటల్ ట్రామా వార్డు ఎంట్రెన్స్‌ను ఢీకొట్టాడు. అయితే అంబులెన్స్‌లో వస్తున్న పేషెంట్స్‌ను రిసీవ్ చేసునేందుకు అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించి ట్రీట్‌మెంట్ ఇప్పించారు. రెండో సారి జరిగిన ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.