King Cobra: అబ్బ తమ్ముడూ.. కింగ్ కోబ్రాలన్నీ ఎవరికో స్పాట్ పెట్టేశాయిగా.. గ్రూప్‌ మీటింగ్‌లో సీరియస్ డిస్కషన్

|

Nov 19, 2022 | 1:56 PM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించినవి ఉంటాయి. ముఖ్యంగా, పాములకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి.

King Cobra: అబ్బ తమ్ముడూ.. కింగ్ కోబ్రాలన్నీ ఎవరికో స్పాట్ పెట్టేశాయిగా.. గ్రూప్‌ మీటింగ్‌లో సీరియస్ డిస్కషన్
King Cobras Photo
Follow us on

King Cobra Viral Photo: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించినవి ఉంటాయి. ముఖ్యంగా, పాములకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. కింగ్ కోబ్రా నుంచి.. పైథాన్ వరకూ అన్ని రకాల పాముల వీడియోలు, ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. అలాంటి పాముల్లో కింగ్‌ కోబ్రా పాములకు ప్రత్యేక స్థానం ఉందన్న విషయం తెలిసిందే. ఇతర పాములతో పోల్చుకుంటే తాచుపాములు చాలా ప్రమాదకరమైనవి. గంటల వ్యవధిలోనే మనుషుల ప్రాణాలను తీసేస్తాయి. అందుకే చాలామంది నాగుపాము (కింగ్ కోబ్రా) పేరు వింటేనే వణికిపోతుంటారు. కింగ్ కోబ్రా సహా.. ఎలాంటి పామును చూసినా.. పరుగులు తీస్తుంటాం.. ఇంకా దగ్గరగా ఉంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే సాధ్యమైనంత వరకు అందరూ పాములకు దూరంగా ఉంటారు. తాజాగా.. కింగ్ కోబ్రాలకు సంబంధించిన ఓ భయంకరమైన ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో చాలా పాములు పడగలు విప్పి మరీ కనిపిస్తున్నాయి.

వైరల్ ఫొటోలో నాలుగు నాగుపాములు కనిపిస్తున్నాయి. దీనిని చూస్తుంటే.. ఈ పాములన్నీ పెద్ద మీటింగే పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. నాలుగు నాగుపాములు కూడా పడగలు విప్పి చెట్టు కొమ్మపై కనిపిస్తున్నాయి. ఇది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. పాములన్నీ ఎవరికో స్పాట్ పెట్టేందుకు సమావేశం అయినట్లు కనిపిస్తుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఫొటో మామూలుగా లేదని.. ఇలా దగ్గర చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అంటూ పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ ఫొటో చూడండి..

ఈ వైరల్ ఫొటోను snake._.world అనే పేజీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేసింది. దీనిని చూసిన నెటిజన్లు.. లైక్ చేయడంతోపాటు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..