గ్రహాంతరవాసులు.. ఈ టాపిక్ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ విశాల విశ్వంలో మనిషి ఒంటరి కాదని, ఇతర గ్రహాలపై కూడా జీవి ఉనికి ఉందని విశ్వసించేవారు చాలామంది ఉంటారు. ప్రముఖ శాస్త్రవేత్తలు ఎంతోమంది ఇదే విషయాన్ని చాలాసార్లు కూడా ప్రస్తావించారు. అలాగే ఏలియన్స్ నేరుగా మనుషులను కలిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అంచనా వేసే శాస్త్రవేత్తలు కూడా లేకపోలేదు. అవన్నీ కూడా వట్టి భూటకం అని కొట్టిపారేసే వాళ్లు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా బొలివియాలో కనిపించిన ఓ నల్లటి ఆకారం.. మరోసారి ఏలియన్స్ ఉనికి ఉన్నట్లు రుజువు చేసిందని కొందరి భావన.
వివరాల్లోకి వెళ్తే.. బొలివియాలోని హుయారినా అనే చిన్న పట్టణంలో కొందరి వ్యక్తులకు ఒక చోట మట్టిలో ఓ నల్లటి ఆకారం కనిపించింది. ఇంతకీ అసలు అదేంటా అని చూసేందుకు దగ్గరకు వెళ్లగా.. అది కాస్తా మాయమైందట. అయితేనేమో ఈలోపు దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఆ నల్లటి ఆకారం చాలా చిన్నగా ఉందని.. గోబ్లిన్ మాదిరిగా ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. దాన్ని ఎవరైనా అక్కడ నుంచి తీసేశారా.? లేక అది నిజంగానే ఏలియనా అనేది తెలియాల్సి ఉంది. కానీ, ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ నల్లటి ఆకారం కనిపించిన రెండు రోజుల ముందు రాత్రివేళలో అక్కడి స్థానికులు ఆకాశంలో ఒక వింత ఆకుపచ్చని కాంతిని చూశారట, అది గ్రహాంతర అంతరిక్ష నౌక లేదా యూఎఫ్‌ఓగా వాళ్లు విశ్వసిస్తున్నారు.(Source)
El cadáver de un supuesto alien fue hallado camino al calvario en Achacachi. Horas antes, comunarios vieron luces y objetos extraños en el cielo. ¿Es real? ➡️ https://t.co/rLWdTxlSxR#F10Noticias #F10Bolivia #F10HD pic.twitter.com/u2HLoDDotm
— F10HD Bolivia (@F10HD_BOLIVIA) March 31, 2023