కొన్ని దశాబ్దాల క్రితం వరకూ ఒక దేశం నుంచి వేరొక దేశానికి ప్రజలు ప్రయాణించాలంటే సముద్రయానాన్ని ఆశ్రయించేవారు. నౌకలు, ఓడలను ఉపయోగించేవారు. అప్పుడు గమ్యస్థానానికి చేరుకోవడానికి చాలా రోజులు పట్టేది. అయితే ఇప్పుడు విమానాలు ప్రయాణాన్ని చాలా సులభతరం చేశాయి. ప్రపంచంలో ఎక్కడ ఏ మారుమూల ప్రాంతాన్ని అయినా విమానంలో ప్రయాణించి గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఇందుకు చేయాల్సింది కేవలం ప్లైట్ టికెట్ ను బుక్ చేసుకోవడం మాత్రమే.. విమానాశ్రయానికి వెళ్లి విమానంలో ప్రయాణించి.. కొన్ని గంటల వ్యవధిలోనే ఏ దేశానికైనా చేరుకోవచ్చు. అయితే నేటికీ ఫ్లైట్‌లో ప్రయాణం కొందరికి అందని ద్రాక్షనే.. కొంచెం ఖరీదైనది. అయితే విమానంలో ప్రయాణం చేయని వారు సైతం.. ఫ్లైట్ ల్యాండింగ్ లేదా టేకాఫ్ ని చూసి సంతోష పడిన ఘటన్లున్నాయి. ప్రస్తుతం ఒక ఫ్లైట్ ల్యాండింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
నిజానికి ఈ వీడియోలో ఫ్లైట్ ల్యాండింగ్ ఎయిర్‌పోర్ట్‌లో కాకుండా… బీచ్‌లో ల్యాండింగ్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. విమానం కేవలం చెట్లకు కొన్ని మీటర్ల ఎత్తులో ఉన్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు. అది నెమ్మదిగా విమానాశ్రయంలో దిగుతుంది. అప్పుడు ఈ విమానం భూమికి చాలా దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. అంత దగ్గరి నుంచి విమానం ల్యాండింగ్‌ను చూడటం ఒక అద్భుతం. ఒక విమానం భూమి నుంచి అతి తక్కువ ఎత్తునుంచి క్రమంగా నేలపై ల్యాండ్ అయినటువంటి దృశ్యాన్ని చూసిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే మరి.
Slim margin of error for this ERJ-190 landing at Skiathos. Would you stand below the landing path?
📹: SloMoSpotter pic.twitter.com/DYikd6RY3o
— Aviation (@webflite) September 1, 2023
ఈ ఆశ్చర్యకరమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @ThebestFigen అనే ID నుంచి షేర్ చేశారు. కేవలం 20 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 17 మిలియన్ల మంది అంటే 1.7 కోట్ల కంటే ఎక్కువ మంది చూశారు. 86 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు.
అదే సమయంలో వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు చేశారు. ‘ఈ దృశ్యం సెయింట్ మార్టెన్‌లోని మహో బీచ్‌లోనిది’ అని ఎవరో కామెంట్ చేశారు. మరికొందరు ‘ఈ వీడియో ఫేక్’ అని అంటున్నారు. అయితే ఎక్కువ మంది ఈ విమానం ల్యాండింగ్ ఫేక్ అని భావించడం విశేషం..
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..