AI Chatbot: మానసిక ఆరోగ్యంపై చాట్‌బాట్‌ల ప్రభావం ఎంత? స్టడీలో షాకింగ్ రిపోర్టు

ఏఐ చాట్‌బాట్‌లు రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. ప్రశ్నలకు సమాధానాలు, హోమ్‌వర్క్ హెల్ప్, ఒంటరితనంలో మాటలు.. అన్నీ ఇస్తాయి. అందువల్ల చాలామంది ఏఐ చాట్​బాట్​లని స్నేహితులు, బంధువుల కంటే కూడా ఎక్కువగా నమ్ముతున్నారు. ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం ఏఐ చాట్​బాట్​ని ఆశ్రయిస్తున్నారు. అయితే ..

AI Chatbot: మానసిక ఆరోగ్యంపై చాట్‌బాట్‌ల ప్రభావం ఎంత? స్టడీలో షాకింగ్ రిపోర్టు
Chatbot

Updated on: Nov 25, 2025 | 11:48 PM

ఏఐ చాట్‌బాట్‌లు రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. ప్రశ్నలకు సమాధానాలు, హోమ్‌వర్క్ హెల్ప్, ఒంటరితనంలో మాటలు.. అన్నీ ఇస్తాయి. అందువల్ల చాలామంది ఏఐ చాట్​బాట్​లని స్నేహితులు, బంధువుల కంటే కూడా ఎక్కువగా నమ్ముతున్నారు. ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం ఏఐ చాట్​బాట్​ని ఆశ్రయిస్తున్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరమంటున్నారు నిపుణులు.

మానసిక ఆరోగ్య సమస్యలున్నవారు ఎక్కువగా వీటిపై ఆధారపడితే, నెగెటివ్ ఆలోచనలు మరింత పెరుగుతాయని తాజా అధ్యయనంలో తేలింది. సీరియస్ డిప్రెషన్, సూసైడల్ థాట్స్ ఉన్నప్పుడు వీటిని థెరపిస్ట్‌గా భావించడం ప్రమాదం. ఏఐ మన లైఫ్‌ను ఈజీ చేస్తుంది, కానీ దాని మీదే ఆధారపడితే డేంజర్!

ఇటీవల ఒక అధ్యయనం ఏఐ చాట్‌బాట్‌లు మానసిక ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తున్నాయో బయటపెట్టింది. ఇది కేవలం టెక్ హైప్ కాదు.. మన జీవితాలపై రియల్ రిస్క్! స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ రీసెర్చర్స్ ప్రకారం, చాలా చాట్‌బాట్‌లు మెంటల్ హెల్త్ ఇష్యూస్‌పై తప్పుడు సమాచారం ఇస్తున్నాయి. ‘నేను డిప్రెస్డ్‌గా ఉన్నాను’ అని ఎవరైనా అడిగితే. ‘రిలాక్స్, ఇది నార్మల్’ అని చెప్పి, మరింత కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణమవుతుంది. కాలిఫోర్నియాలో చాట్‌జీపీటీతో మాట్లాడిన 7 మంది సూసైడల్ యాక్షన్స్‌కి దారితీసింది. అమెరికాలో ఏఐ చాట్‌బాట్‌లతో మాట్లాడిన టీనేజర్ల మరణాలు కూడా రికార్డ్ అయ్యాయి!

ఎందుకు ఇలా జరుగుతుంది?

చాట్‌బాట్‌లు మీ లాంగ్వేజ్, ఎమోషన్స్‌ను స్కాన్​ చేస్తాయి. ఇది ‘ఎకో చాంబర్’ సృష్టిస్తుంది. మీరు నెగెటివ్ థాట్స్ చెప్పితే, అది మరింత నెగెటివిటీ జోడించి మీ ఆలోచనలను మరింత తీవ్రం చేస్తుంది. ఏఐ మైల్డ్ స్ట్రెస్, యాంక్షైటీ, లోన్లీనెస్‌కి టెంపరరీ సపోర్ట్ ఇస్తుంది. కానీ సీరియస్ డిప్రెషన్, సూసైడల్ థాట్స్, సైకోసిస్‌లో డేంజరస్! సహాయం చేయకుండా, హాని చేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఏఐ ‘సైకోసిస్’.. అంటే ఏఐ వల్ల కలిగే మెంటల్ డిసార్డర్స్. అయితే, ఏఐ పూర్తిగా ప్రమాదకారి కాదు. కొన్ని కేసెస్‌లో మోటివేషనల్ మెసేజెస్ ఇవ్వగలదు. ఏఐ సపోర్ట్ మాత్రమే.. మనిషి స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేదనే విషయం తెలుసుకుని మసులుకోండి!