TikTok: టిక్‌టాక్ వీడియోల వ్యసనం.. ఎంతమంది జీవితాలు బలితీసుకుందో తెలిస్తే షాక్ అవుతారు..!

|

Jul 12, 2021 | 8:48 PM

TikTok: ప్రజల్లో టిక్‌టాక్ వీడియోల వ్యసనం వారి ప్రాణాల మీదకు తెస్తోంది. సాంసారాల్లో చిచ్చుపెట్టడమే కాకుండా.. ఎంతో జీవితాలను రోడ్డుపాలు

TikTok: టిక్‌టాక్ వీడియోల వ్యసనం.. ఎంతమంది జీవితాలు బలితీసుకుందో తెలిస్తే షాక్ అవుతారు..!
Tiktok
Follow us on

TikTok: ప్రజల్లో టిక్‌టాక్ వీడియోల వ్యసనం వారి ప్రాణాల మీదకు తెస్తోంది. సాంసారాల్లో చిచ్చుపెట్టడమే కాకుండా.. ఎంతో జీవితాలను రోడ్డుపాలు చేస్తోంది. కుటుంబాలలో చిచ్చు పెడుతోంది. పెద్ద చిన్నా అనే తేడా లేదు, అంతా టిక్‌టాక్‌ మాయలో పడుతున్నారు జనాలు. ఇప్పుడు టిక్‌టాక్‌ బ్యాన్ అయినప్పటికీ.. దాని ప్లేస్‌లో సోషల్ మీడియా వీడియో షేరింగ్ యాప్స్‌ అనేకం రావడంతో ప్రజలు మరింత రెచ్చిపోతున్నారు. ఈ వీడియో షేరింగ్ యాప్‌ల కారణంగా ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయి కెరీర్‌ను నాశనం చేసుకున్నారు. అంతేకాదు.. మరీ దారుణంగా హత్యలకు, ఆత్మహత్యలకు, మానసిక ప్రశాంతతను కోల్పోయేలా చేస్తోంది ఈ యాప్. ఈ యాప్‌లో వీడియోల కోసం.. ఎత్తు పై నుంచి దూకడం, రోడ్లపై వేగంగా వెళ్లడం, రైళ్లపై నుంచి దూకడం, రైళ్లకు అడ్డంగా వెళ్లి ప్రమాదకర నిల్చోవడం వంటి ఫీట్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక కొన్ని వీడియోలు వైరల్‌గా మారడంతో ఇళ్లలో గొడవలు జరిగి.. అవి హత్యలు, ఆత్మహత్యలకు ప్రేరిపిస్తున్న ఘటనలు కోకొల్లుగా ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్నింటిని ఇప్పుడు చర్చించుకుందాం..

గొడవలు, హత్యలకు దారితీసిన టిక్‌టాక్‌ ఘటనలు..
1. సోనికా కేతావత్… టిక్ టాక్ వీడియోలు, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో ఫేమస్ అయ్యింది. సెప్టెంబర్‌ 13, 2019న స్నేహితులతో కలిసి బైక్ రైడింగ్ చేస్తూ టిక్ టాక్ వీడియో చేసింది సోనికా. అయితే, ఈ వీడియో తీస్తుండగానే నల్గొండ సమీపంలో యాక్సిడెంట్ అయ్యింది. ఆ ప్రమాదంలో సోనికా స్పాట్‌లోనే చనిపోయింది.
2. నవంబర్‌ 7, 2019న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ డ్యాన్స్‌లు చేసి ఆ వీడియోలను టిక్‌టాక్‌లో షేర్ చేసింది. అవి చూసి ఆమె భర్త.. ఆమెను వారించాడు. అయినప్పటికీ వినకపోవడంతో ఆగ్రహంతో భార్యను హతమార్చాడు.
3. నవంబర్‌ 28, 2019న గుంటూరులో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. టిక్ టాక్ వీడియోలు పోస్ట్ చేస్తోందనే ఆగ్రహంతో భార్యను చంపేసి స్మశానవాటికలో దహనం చేశాడు భర్త చిన్ననర్సయ్య.
4. డిసెంబర్‌ 10, 2019 ఢిల్లీలో జరిగిన పెళ్లిలో టిక్‌ టాక్‌ వీడియోపై ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో కాల్పులు జరుపగా నలుగురుకి తీవ్ర గాయాలు అయ్యాయి.
5. 2020, ఫిబ్రవరి నెలలో హర్యానాలోని సోనిపాట్‌లో పాపులార్టీ రావడంతో టిక్‌ టాక్ స్టార్ ను హత్య చేశాడు తన స్నేహితుడు.
6. 18 మే, 2020న హైదరాబాద్‌‌లో టిక్ టాక్ వీడియోలతో యువతిని నమ్మించి రేప్ చేశాడు ఓ యువకుడు. ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
7. 21 ఏప్రిల్‌, 2021న విశాఖలో టిక్ టాక్ పేరుతో మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన టిక్‌టాక్‌ ఫేం ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
8. 11 జులై, 2021లో హైదరాబాద్‌ సనత్‌నగర్‌‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యకు టిక్ టాక్ వీడియోలు పెట్టవద్దని హెచ్చరించాడు. ఎంతచెప్పినా వినకపోవడంతో విసిగిపోయిన భర్త.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

చైనీస్ ఇంటర్నెట్ టెక్నాలజీ కంపెనీ బైట్ డ్యాన్స్ పేరుతో టిక్‌టాక్ యాప్‌ను రూపొందించింది. 2016లో డౌయిన్ పేరుతో చైనాలో.. 2017లో టిక్‌టాక్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ఈ యాప్‌ను విడుదల చేసింది. సోషల్ మీడియా యాప్ అయిన ఈ టిక్‌టాక్ ద్వారా.. జోక్స్ క్లిప్స్, వీడియో సాంగ్స్, సినిమా డైలాగ్స్‌కు తగ్గట్లుగా లిప్‌ మూమెంట్స్, బాడీ మూమెంట్స్ ఇవ్వడం, డ్యాన్స్ చేయడం వంటి సులభంగా రూపొందించే అవకాశం ఉంది. 155 దేశాలలో, 75 భాషల్లో వీడియో రూపొందించుకునే అవకాశం ఉంది. 2019లో 500 మంది మిలియన్ల యూజర్లు ఉండగా.. 2021 నాటికి 689 మంది మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. భారత్‌లో 20 మిలియన్ల యాక్టీవ్ వినియోగదారులు ఉన్నారు.

ఇక సగటు వ్యక్తి రోజుకు 52 నిమిషాల పాటు టిక్‌టాక్‌ చూస్తున్నట్లు సర్వేలు చెబుతున్నారు. అమెరికాలో టిక్‌ టాక్‌ వాడుతున్న 10 -29 సంవత్సరాల వయసు వారు 62 శాతం ఉన్నారు. 2020 నాటికి ప్రతీరోజు టిక్‌ టాక్‌ వీడియోలు చూస్తున్న వారు ఒక మిలియన్‌ మంది ఉన్నారు. అయితే, ఈ చైనా యాప్‌ లలోని డేటా భద్రతపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో.. అమెరికా, ఇండియా వంటి దేశాల్లో పలు చైనా యాప్‌లతో పాటు టిక్‌ టాక్‌‌ యాప్‌పై నిషేధం విధించారు. అయితే, టిక్‌టాక్‌కు బదులుగా ఇప్పుడు అనేక వీడియో షేరింగ్ యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ యాప్స్ ద్వారా కూడా వీడియోలు చేసేందుకు వీలుండటంతో ప్రజలు వాటిపై దృష్టి సారించారు. మొత్తంగా ఈ వీడియో షేరింగ్ యాప్స్ వ్యసనం ప్రజల జీవితాలను ఆగం చేస్తుందనే చెప్పాలి.

Also read:

ICC Player of the Month: భారత ఆటగాళ్లకు మరోసారి నిరాశే.. రేసులో ఉన్నా అవార్డులు దక్కలే..!

Audio Tape: సంచలనం సృష్టిస్తున్న ఆడియో టేప్‌ లీక్‌లు.. మారుతున్న నేతల తలరాతలు.. ప్రముఖుల ఆడియో టేపుల వివరాలు..