Puzzle Picture: ఈ ఫోటోలో ప్రముఖ హాస్య నటుడు ఉన్నాడు.. ఆయనెవరో కనిపెట్టండి చూద్దాం..

Puzzle Picture: హాస్య నటుడు అనగానే.. దాదాపుగా అందరకి బ్రహ్మానందం, ఆలీ, ఎంఎస్ నారాయణ వంటి కొందరు ప్రముఖులు గుర్తుకు వస్తారు.

Puzzle Picture: ఈ ఫోటోలో ప్రముఖ హాస్య నటుడు ఉన్నాడు.. ఆయనెవరో కనిపెట్టండి చూద్దాం..
Puzzle Picture
Follow us

|

Updated on: Mar 19, 2022 | 5:45 AM

Puzzle Picture: హాస్య నటుడు అనగానే.. దాదాపుగా అందరకి బ్రహ్మానందం, ఆలీ, ఎంఎస్ నారాయణ వంటి కొందరు ప్రముఖులు గుర్తుకు వస్తారు. కొంత వెనుకటి తరం వారైతే జంద్యాల పేరు టక్కున చెబుతారు. అయితే, తెలుగు ప్రేక్షకులు ఈ సమాధానం ఇస్తారు. మరి, దేశ వ్యాప్తంగా ప్రస్తుతం మంచి కమీడియన్‌గా గుర్తింపు పొందింది ఎవరయా అంటే కపిల్ శర్మ. టీవీ షో ల ద్వారా ప్రేక్షకులను అలరించి, నవ్వులు పూయిస్తుంటారు కపిల్ శర్మ. హిందీలో అనేక కామెడీ షోలు చేసి.. అమితమైన ప్రేక్షకాదరణ పొందారు కపిల్ శర్మ. ఇలా దేశ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. కపిల్ శర్మ టీవీ షో లోనే కాకుండా.. పలు సినిమాల్లోనూ నటించారు. తాజాగా మరికొన్ని సినిమాలు కూడా చేస్తున్నారు.

ఇటీవల కపిల్ శర్మ తాను నటిస్తున్న సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నట్లుగా ఉండే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో జిమ్ కసరత్తులు చేస్తూ చెమటోడుస్తూ కనిపిస్తారు కపిల్. తాజాగా ఈయనకు సంబంధించి మరో ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సినిమా షూటింగ్‌లో భాగంగా.. డెలివరీ బోయ్‌గా రోడ్డుపై బైక్ చేస్తున్నారు కపిల్ శర్మ. ఈ సందర్భంగా కపిల్ శర్మను ఫోటో తీసిన అభిమాని.. దానిని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘సర్ ఇవాళ నేను మిమ్మల్ని లైవ్‌లో చూశాను.’ అంటూ క్యాప్షన్ పెట్టి, కపిల్ శర్మను ట్యాగ్ చేశాడు. దీనికి కపిల్ శర్మ కూడా స్పందించారు. ఈ ఫోటోను రీ ట్వీట్ చేస్తూ సరదా కామెంట్ చేశారు. ‘ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకు’ అని క్యాప్షన్ పెట్టారు కపిల్ శర్మ. అయితే, ఈ ఫోటో ఇఫ్పుడు వైరల్‌గా మారింది. సాధారణ ప్రజల్లో మమేకమైనట్లుగా ఉన్న కపిల్ శర్మను.. ఈ ఫోటోలో ఎక్కడున్నాడా? అని కనిపెట్టేందుకు కాసేపు గందరగోళానికి గురవుతున్నారు. కాసేపటి తరువాత గుర్తుపట్టి వావ్ అంటున్నారు.

Also read:

IND vs AUS: ఆస్ట్రేలియాని ఓడించడం అంత సులువు కాదు.. ఎందుకంటే ఈ 5గురు ప్లేయర్లు చాలా డేంజర్..!

Clouds: మేఘాలు నలుపు రంగులో ఉంటాయి.. కానీ దీని వెనుక దాగున్న సీక్రెట్‌ ఏంటో తెలుసా..?

Andhra Pradesh: బందరులో తీవ్ర ఉద్రిక్తత.. పొలిటికల్ టర్న్ తీసుకున్న నాగలక్ష్మి ఆత్మహత్య..