ఇంటి నుంచి బయటకు వెళ్తే.. తిరిగి ఇంటికి వచ్చేంత వరకు అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రోడ్డుపై (Road Accident) లేదా రోడ్డు పక్కన నిలబడి ఉంటే ఆ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రమాదాలు ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ విధంగా జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం యాక్సిడెంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశంలో ఏటాలక్షకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. అందులో ప్రాణనష్టంతో పాటు గాయపడిన వారి సంఖ్య అధికంగానే ఉందని ఆందోలన వ్యక్తం చేసింది. ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు (Social Media) సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక బాలుడు పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తుంటే ఆ బాలుడు అక్కడే ఉండి ఉంటే కచ్చితంగా అతని ప్రాణాలు మిగిలేవి కావనే విషయం అర్థమవుతోంది. రెండు సెకన్ల ఆలస్యమైతే భారీ నష్టం జరిగేది. వీడియోలో ఒక బాలుడు రోడ్డు పక్కన ఉన్న ఇనుప రెయిలింగ్‌ను పట్టుకొని నిల్చున్నాడు. కొంత సమయం తర్వాత అతను అక్కడి నుంచి కాస్త పక్కకు వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. అంతే కాకుండా రెయిలింగ్ ను బలంగా ఢీ కొట్టింది. దీంతో హ్యాండ్‌రైల్, కారు ధ్వంసమయ్యాయి. అదృష్టం కొద్దీ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
Lucky boy ??? pic.twitter.com/C2JD37urrd
ఇవి కూడా చదవండి— Best Videos ?? (@_BestVideos) August 25, 2022
ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. బాలుడు చాలా అదృష్టవంతుడు అని క్యాప్షన్ రాశారు. కేవలం 16 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటి వరకు 3 లక్షల 72 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వందలాది మంది వీడియోను లైక్ చేస్తున్నారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇదే చివరి గమ్యం అని కొందరు అంటుంటే, ఇది చాలా క్లోజ్ మ్యాటర్ అని కొందరు అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..