Viral: మహిళా పోలీస్‌ ఆఫీసర్‌పై యువకుడి పైశాచిక దాడి.. సీసీటీవీలో షాకింగ్‌ విజువల్స్‌

|

Dec 03, 2024 | 8:15 PM

మహిళలపై దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. చివరికి మహిళా పోలీసులకు కూడా భద్రత కరువవుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటనకు సంబంధించి వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది.? ఆ వీడియోలో ఏముందుఓ ఇప్పుడు తెలుసుకుందాం..

Viral: మహిళా పోలీస్‌ ఆఫీసర్‌పై యువకుడి పైశాచిక దాడి.. సీసీటీవీలో షాకింగ్‌ విజువల్స్‌
Viral Video
Follow us on

సమాజంలో మహిళల భద్రత రోజురోజుకీ ప్రశ్నార్థకంగా మారుతోంది. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా, ఎన్ని శిక్షలు పడుతోన్నా పరిస్థితులు మాత్రం మారడం లేదు. మహిళలపై దాడులు నిత్యకృత్యమవుతున్నాయి. అయితే చట్టాన్ని రక్షించే పోలీసుల భద్రత కూడా గాల్లో దీపంలా మారుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన షాక్‌కి గురి చేస్తోంది. మహిళా కానిస్టేబుల్‌పై యువకుడు చేసిన దాడికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఓ మహిళా కానిస్టేబుల్‌ వీధిలో నడుస్తూ వెళ్తోంది. అదే సమయంలో ఓ యువకుడు బైక్‌పై అటుగా వచ్చి, మహిళా కానిస్టేబుల్‌ను అడ్డగించాడు. మొదట వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో యువకుడు ఒక్కసారిగా మహిళపై దాడికి దిగాడు. మహిళను గట్టిగా చుట్టేసి నేలపై పడేశాడు. దీంతో మహిళ అడ్డుకోవడానికి ఎంతో ప్రయత్నించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వెంటనే అక్కడి వచ్చిన కొందరు ఆ యువకుడిని పక్కకు లాగేసే ప్రయత్నం చేశారు.

అయితే అంతలోనే ఆ మహిళా కానిస్టేబుల్‌ సదరు యువకుడి బండి నెంబర్‌ను ఫొటో తీసేందుకు ప్రయత్నించింది. అయితే అంతలోనే అక్కడికి వచ్చిన కొందరు యువకులు సైతం మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేశారు. ఇదంతా అక్కడే ఉన్న ఓ సీటీటీవీలో రికార్డ్‌ అయ్యాయి. దీంతో ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. గతంలో జరిగిన ఏదో సంఘటనను మనసులో పెట్టుకునే ఈ దాడి జరిగినట్లు స్పష్టమవుతోంది.

వైరల్ వీడియో..

సదరు మహిళా కానిస్టేబుల్‌ను అమ్రీన్‌గా గురించారు. ఆమెపై జరిగిన దాడిని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. మహిళా కానిస్టేబుల్‌ నమోదు చేసిన కేసు ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని మొరాదాబాద్ పోలీసులు తేల్చి చెప్పారు. మొత్తం మీద ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పోలీసులకే భద్రత లేకపోతే ఎలా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..