Viral News: కోలిగ్స్‌ను పెళ్లికి ఆహ్వానించిన మహిళా ఉద్యోగి.. 70 మందిలో ఒక్కరే హాజరుకావడంతో షాకింగ్ నిర్ణయం..

|

Aug 18, 2022 | 8:56 AM

Viral News: ప్రతీ ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించాలని కోరుకుంటారు. సెల్ఫ్‌ రెక్స్పెక్ట్‌కు ఏ మాత్రం భంగం కలిగినా హర్ట్‌ అవుతారు. ఇది సర్వసాధారణమైన విషయం. తమకు సరైన గౌరవం లభించని..

Viral News: కోలిగ్స్‌ను పెళ్లికి ఆహ్వానించిన మహిళా ఉద్యోగి.. 70 మందిలో ఒక్కరే హాజరుకావడంతో షాకింగ్ నిర్ణయం..
Representative Image
Follow us on

Viral News: ప్రతీ ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించాలని కోరుకుంటారు. సెల్ఫ్‌ రెక్స్పెక్ట్‌కు ఏ మాత్రం భంగం కలిగినా హర్ట్‌ అవుతారు. ఇది సర్వసాధారణమైన విషయం. తమకు సరైన గౌరవం లభించని చోట ఉండడానికి ఇష్టపడరు. తాజాగా చైనాలో జరిగిన ఓ సంఘటన ఈ మాటలకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఓ మహిళ తన ఆత్మ గౌరవానికి భంగం కలగడంతో తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కి గురి చేసింది.

వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన ఓ మహిళా ఉద్యోగిని పెళ్లి ఫిక్స్‌ అయ్యింది. పెళ్లి ఎంతో సంతోషంగా జరుపుకోవాలనుకున్న ఆమె తన సహుద్యోగులకు ఆహ్వానం ఇచ్చింది. ఒకరిని పిలిచి మరొకరిని పిలవకపోతే బాధపడుతారనుకొని ఆఫీస్‌లో ఉన్న మొత్తం 70 మందిని పెళ్లికి ఆహ్వానించింది. ఎవరూ మిస్‌ కాకూడదనే ఉద్దేశంతో రెండు నెలల ముందే ఇన్విటేషన్‌ ఇచ్చింది. అంతేకాకుండా ఎక్కడ మర్చిపోతారో అని ముందు రోజు మళ్లీ అందరికీ గుర్తు చేసింది. అయితే పెళ్లి జరిగే సమయానికి 70 మందిలో కేవలం ఒక్కరంటే ఒక్కరే హాజరయ్యారు.

దీంతో ఆమె తీవ్ర నిరాశ చెందింది. బంధువుల ముందు అవమానకరంగా భావించింది. అంత మంది కోసం వండిన వంటలు వృథా అయ్యాయని ఓవైపు, కుటుంబ సభ్యుల ముందు అవమానానికి గురయ్యాననే భావన మరో వైపు. దీంతో ఇగో హర్ట్‌ అయిన సదరు ఉద్యోగిని వివాహం జరిగిన మరుసటి రోజే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖను పంపించింది. తనకు గౌరవం లభించని చోట ఉండడం ఎందుకన్నట్లు కంపెనీ వీడేందుకు సిద్ధమైంది. ఈ వార్త కాస్త నెట్టింట వైరల్‌ అయ్యింది. ఈ విషయం తెలిసిన కొందరు ఇంత దానికే రాజీనామా చేస్తారా.? అనగా మరికొందరు మాత్రం ఆమె తీసుకున్న నిర్ణయాన్ని మద్ధతు తెలుపుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..