Viral Video: మార్చి నెల ప్రారంభం నుంచే దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అట్టుడికిపోతున్నారు. ఎండవేడిమిని తాళలేక అతలాకుతలం అవుతున్నారు. చల్లదనం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కూల్ డ్రింక్స్ తాగడం, శరీరానికి చలువ చేసే డ్రింక్స్ తాగడం, రోజుకు మూడుసార్లు స్నానం చేయడం వంటివి చేస్తున్నారు. ఇక తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిన వారు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ వెంట వాటర్ బాటిల్, ఎండ నుంచి రక్షణ కోసం గొడుగు వంటి సేఫ్టీ టిప్స్ పాటిస్తున్నారు. గొడుగు పెట్టుకోవడం వలన ఎండ నుంచి బయటపడొచ్చు.
ఇక ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎండలు ఎంతున్న పెళ్లిళ్లు ఆగవు కదా. ఎండలను తట్టుకునేందకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. తాజాగా ఓ పెళ్లి బృందం కూడా ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ పెళ్లి బృందం ఐడియా అదిరిపోయిందనే చెప్పాలి. వరుడిని గుర్రంపై ఊరేగిస్తూ పెళ్లి మండపానికి తరలించాలి. అయితే, ఎండలు తీవ్రస్థాయిలో ఉండటంతో పెళ్లి నిర్వాహకులు సరికొత్త ఐడియా అమలు చేశారు. పెళ్లి బృందం వరకు పెద్ద పరదాను ఏర్పాటు చేశారు. చతురస్రాకారంలోని టెంటుకు నాలుగు మెటల్ ఫ్రేమ్స్ ఏర్పాటు చేసి.. వాటిని నాలుగు దిక్కులు పట్టుకునేందుకు నలుగురు మనుషులను ఏర్పాటు చేశారు. ఇలా టెంటును ముందుకు తీసుకెళ్తూ.. ఎండ నుంచి సేఫ్ అయ్యేందుకు చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది. అయితే, పెళ్లి బృందం ఇలా వెళ్తుండటాన్ని గమనించిన కొందరు స్థానికులు దృశ్యాన్ని తమ ఫోన్ కెమెరాలో బందించారు. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియోను చూసి నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అదిరిందయ్యా చంద్రం.. కొత్త పెళ్లి కొడుకు.. కొత్త జోష్‌లో వెళ్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సూపర్ వీడియోను మీరూ చూసేయండి.
This is why #India is called land of Innovation or simply
“Jugaad” To beat the #Heatwave during “Baraat” Indians have found solution.#innovation pic.twitter.com/Fs8QociT2K— Devyani Kohli (@DevyaniKohli1) April 27, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Also read:
Viral News: ఆరేళ్ల కొడుకుతో తండ్రి అగ్రీమెంట్.. షాక్ అవుతున్న నెటిజన్లు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!
Viral News: కొంపముంచిన కుక్క.. ఏకంగా లక్షా యాభై వేలు యామం.. అసలు ఏం జరిగిందంటే..?