
నలుగురు నడిచే దారిలో నడిస్తే కిక్కు ఏముంటుంది చెప్పండి. అందుకే మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని భావిస్తుంటారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఈ నియమం ఎక్కువగా ఉపయోగపడుతుంది. అందరూ అమ్మే వస్తువులనే వినూత్నంగా విక్రయించే వారికే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. ఇందుకోసం వ్యాపారాలు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. ముఖ్యంగా ఫ్యాషన్, ఫుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి వైవిధ్యాలు కనిపిస్తాయి.
కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటుంటారు. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి చికెన్ లెగ్ పీస్‌ను కట్ చేస్తున్నట్లు ఉంది. అయితే ఆ తర్వాత కానీ తెలియలేదు అది చికెన్ కాదని, ఒక కేక్ అని. అవును నిజమో అది కేక్.
diyacakesit అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. అచ్చంగా తందూరి చికెన్ రూపంలో కేక్‌ను తయారు చేశారు. ఈ కేక్‌ను డార్క్ చాక్లెట్ ఫేవర్‌తో రూపొందించారు. అయితే పైన అచ్చంగా తందూరి చికెన్ మాడిన రంగు స్పష్టంగా కనిసిస్తోంది. అసలు కట్ చేసేంత వరకు అది కేక్ అన్న అనుమానం కూడా రాకుండా దీనిని రూపొందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు దానిని తయారు చేసిన వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తారు. కొందరు నెటిజన్లు అయితే చూసే కళ్లను మాయ చేయడం ఇదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వెరైటీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..