Viral Video: బాల్యం ఎప్పుడూ మధురమే.. ఈ పిల్లలు చేసే పనికి కోపమొచ్చినా నవ్వాపుకోలేం

మనిషి జ్ఞాపకాల్లో బాల్య స్మృతులకు ఉండే ప్రాధాన్యతే వేరు. బాల్యం ఎప్పుడూ గుర్తొచ్చినా మనకూ ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. కల్మషం లేని మనసుతో చేసిన అల్లరి, ఆడుకున్న ఆటలు ఇప్పటికీ గుర్తుకు రావడం సహజమే. ఈ జ్ఞాపకాలను మరే...

Viral Video: బాల్యం ఎప్పుడూ మధురమే.. ఈ పిల్లలు చేసే పనికి కోపమొచ్చినా నవ్వాపుకోలేం
Children Playing In Mud

Edited By:

Updated on: Jul 06, 2022 | 3:15 PM

మనిషి జ్ఞాపకాల్లో బాల్య స్మృతులకు ఉండే ప్రాధాన్యతే వేరు. బాల్యం ఎప్పుడూ గుర్తొచ్చినా మనకూ ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. కల్మషం లేని మనసుతో చేసిన అల్లరి, ఆడుకున్న ఆటలు ఇప్పటికీ గుర్తుకు రావడం సహజమే. ఈ జ్ఞాపకాలను మరే ఇతర ఆనందాలతో పోల్చుకోలేం. ఒక వ్యక్తికి అవకాశం దొరికినప్పుడల్లా, అతను తన చిన్ననాటికి తిరిగి రావాలని కోరుకుంటాడు. ముఖ్యంగా వర్షాకాలంలో ఆడే ఆటలు, దాని గురించి ఆలోచిస్తేనే సంతోషం కలుగుతుంది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో చిన్నారుల బృందం బురదలో సరదాగా గడుపుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో కొంతమంది చిన్నారులు బురదలో జారుడుబల్ల ఆటలు ఆడుకుంటున్నారు. పిల్లలు దానిపై మలుపులు తిరుగుతూ కేరింతలు కొడుతున్నారు. కాగా ఈ వీడియో బాల్యంలోని మర్చిపోలేని రోజులను గుర్తుకు తెస్తోంది.

ఈ వీడియోను Earth.brains అనే ఖాతా ద్వారా Instagramలో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోలు మూడు లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ క్లిప్‌ను చూసి చాలా మంది తమ చిన్ననాటి స్నేహితులను కూడా ట్యాగ్ చేశారు. ఈ వీడియో చూసిన వారంతా తమ చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చుకోవడమే కాకుండా ఈ వీడియో ద్వారా చాలా మందికి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.