సోషల్ మీడియా (Social Media).. ఈ పేరు వినని వాళ్లు ఇప్పుడు ఎవరూ లేరు. చిన్నాపెద్దా, ఆడామగా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతుల్లోనూ సోషల్ మీడియా తప్పనిసరి అయింది. సెల్ ఫోన్లలో ఇంటర్నెట్ ఉండటంతో ఇది మరింత చేరువైంది. ఒక రకంగా చెప్పాలంటే బంధాలు, బంధువుల కంటే సోషల్ మీడియాలో అత్యవసరమైనదిగా మారిపోయింది. ఈ క్రమంలో రకరకాల వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తాయి. ఆలంటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ (Viral) గా మారుతుంటాయి. వీటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. సాధారణంగా ప్రకృతి ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. కానీ కోపం వస్తే మాత్రం ఉగ్రరూపం చూపిస్తుంది. ప్రకృతి ఒడిలో హాయిగా సేదరీపే ప్రాణులు ఎన్నో.. వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో ఓ గున్న ఏనుగు గుంటలో చిక్కుకుంది. అది బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ బయటకు రాలేకపోతుంది. వెంటనే అక్కడ ఉన్న పెద్ద ఏనుగు చిన్న ఏనుగును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుంది. అయినా లాభం లేకపోవడంతో గుంతలో దిగి తొండంతో గున్న ఏనుగును పైకి లాగుతుంది. అనంతరం పెద్ద ఏనుగు కూడా గుంట నుంచి బయటకు వస్తుంది. ప్రమాదం నుంచి బయటపడిన గున్న ఏనుగు మందతో కలిసి చెంగుచెంగుమంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
Elephants have such a strong bonding that every female elephant in the herd is a mother to all the calves.
ఇవి కూడా చదవండిMother & aunts gather together to help the kid gets out. pic.twitter.com/VlIpLM6LJ8
— Susanta Nanda IFS (@susantananda3) August 21, 2022
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో పోస్ట్ అయింది. ఈ క్లిప్ కు ఇప్పటి వరకు 32,000 వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా వేల సంఖ్యలో లైక్స్ చేస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వీడియో చూశాక నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. వీడియో మనసు దోచుకుందని, ఏనుగుల సహకారానికి ముగ్దులయ్యామని ఇలా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..