
ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు.. ఇదీ ఈ మధ్యకాలంలో ఓ సినిమాలోని ఫేమస్ డైలాగ్. ఏ తల్లి అయినా తన బిడ్డ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుంది. తన ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా కుడా ఎలాంటి సంకోచం లేకుండా ప్రాణాలకు తెగించి బిడ్డను కాపాడుకుంటుంది. అందుకే తల్లీ బిడ్డల మధ్యఉన్న బంధం చాలా గొప్పది. దీనిని మాటల్లో వర్ణించలేం. అనుభవిస్తేనే గానీ తెలుసుకోలేం. కొన్ని సార్లు తల్లులు పరాక్రమానికి, ధైర్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంటారు. మనుషుల్లోనే కాకుండా జంతువుల్లోనూ మాతృత్వపు మాధుర్యం ఉంటుంది. తల్లి ప్రేమకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి. వీటిని చూసినప్పుడల్లా మనకు ఒక రకమైన ఫీల్ కలుగుతుంది. ప్రకృతి చాలా ప్రమాదకరమైనది. అది దూరం నుంచి చూసినంత అందంగా ఉండదు. బతుకు కోసం నిత్యం పోరాటం చేస్తూనే ఉండాలి. చిరుతపులి చాలా ప్రమాదకరమైన క్రూర జంతువు. అది క్షణ కాలంలో వేటాడుతుంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ చిరుత పులి అడవి పంది పిల్లను వేటాడుతుంది. చాలా దూరం నుంచి చిరుత పంది పిల్లను తరుముకుంటూ రావడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. కాసేపటి చిరుత ఎరను పట్టుకుంటుంది. అదే సమయంలో అక్కడి నుంచి తల్లి అడవి పంది పరిగెత్తుకుంటూ వస్తుంది. చిరుతను చూసి భయపడకుండా ఎంతో ధైర్యంగా వెంటపడుతుంది. తల్లి అడవి పందిని చూసి చిరుత తీవ్రంగా భయపడిపోతుంది. పిల్ల పందిని వదిలేసి ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తుంది.
Mom is there to protect you… don’t worry pic.twitter.com/YpdI4vpgzM
— Dr.Samrat Gowda IFS (@IfsSamrat) October 13, 2022
వైరల్ అవుతున్న ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ అయింది. ఇంటర్నెట్ లో అప్ లోడ్ అయిన వెంటనే ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ క్లిప్ ను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వీడియో చూసిన తర్వాత తమ అభిప్రాయాలను కామెంట్లు రూపంలో రాస్తున్నారు. తల్లి ప్రేమ ముందు మృత్యువు కూడా తలొంచిల్సాందేనని అభిప్రాయపడుతున్నారు.