Trending Video: తల్లిని మించిన యోధురాలు ఎవ్వరూ లేరు.. ఈ వీడియోనే అందుకు నిదర్శనం.. మీరూ ఓ లుక్కేయండి..

|

Dec 11, 2022 | 4:10 PM

గజేంద్ర మోక్షం గురించి అందరికీ తెలిసిందే. నీళ్లు తాగేందుకు వచ్చిన ఏనుగును మొసలి పట్టుకుంటుంది. దాని బారి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఏనుగు మొసలి బలం ముందు...

Trending Video: తల్లిని మించిన యోధురాలు ఎవ్వరూ లేరు.. ఈ వీడియోనే అందుకు నిదర్శనం.. మీరూ ఓ లుక్కేయండి..
Elephant Video
Follow us on

గజేంద్ర మోక్షం గురించి అందరికీ తెలిసిందే. నీళ్లు తాగేందుకు వచ్చిన ఏనుగును మొసలి పట్టుకుంటుంది. దాని బారి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఏనుగు మొసలి బలం ముందు నిలువలేకపోతుంది. దీంతో తనను రక్షించాలంటూ ఆ శ్రీ మహావిష్ణువును ప్రార్ధిస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి గజరాజును రక్షిస్తాడు. అలాంటి సీన్‌ ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఇక్కడ ఏనుగును రక్షించేందుకు విష్ణుమూర్తి రాలేదు.. కానీ ఏం జరిగిందో మీరే చూడండి. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక ఏనుగుల మంద ఓ ఏరును దాటుతోంది. ఈ క్రమంలో అందులో ఉన్న మొసలి ఆ ఏనుగుల మందలోని ఓ చిన్ని ఏనుగుపై దాడి చేసింది. నోటితో ఏనుగు తొండాన్ని పట్టుకుంది. మొసలి దాడిని గమనించిన మిగతా ఏనుగులు గబగబా ఒడ్డుకు వెళ్లిపోయాయి.

అయితే తన బిడ్డపై మొసలి దాడి చేయడాన్ని గమనించిన తల్లి ఏనుగు వెంటనే నీటిలోకి దిగింది. మొసలి బారినుంచి తన పిల్లను కాపాడి ఒడ్డుకు చేర్చింది. ఆతర్వాత ఆమొసలికి చుక్కలు చూపించింది. తన తలతో మొసలిని అదిమిపట్టింది. తొండంతో ఎత్తి అవతల పడేసింది. తన బలమైన కాళ్లతో ఆ మొసలిని తొక్కి తొక్కి పచ్చడి చేసింది.

ఇవి కూడా చదవండి

‘వైల్డ్‌ లైఫ్‌ కల్చర్‌1’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను వేలాదిమంది నెటిజన్లు వీక్షించారు. వందల్లో లైక్‌ చేశారు. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. తల్లి ప్రేమ ముందు ఏ శక్తి నిలవలేదంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..