Viral Video: నీ గుండె ధైర్యానికి శెభాష్ అనాల్సిందే.. లారీ డ్రైవర్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

రోడ్లపై లారీలు నడపడం (Driving) అంత తేలికైన విషయం కాదు. దానికి చాలా అప్రమత్తత అవసరం. లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. రోడ్లపై హై స్పీడ్ వాహనాల రద్దీ మరింత అధికమైంది. అటువంటి పరిస్థితిలో..

Viral Video: నీ గుండె ధైర్యానికి శెభాష్ అనాల్సిందే.. లారీ డ్రైవర్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
Truck Video Viral

Updated on: Sep 14, 2022 | 8:26 AM

రోడ్లపై లారీలు నడపడం (Driving) అంత తేలికైన విషయం కాదు. దానికి చాలా అప్రమత్తత అవసరం. లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. రోడ్లపై హై స్పీడ్ వాహనాల రద్దీ మరింత అధికమైంది. అటువంటి పరిస్థితిలో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కానీ కొంత మంది డ్రైవర్లు మాత్రం తమ స్కిల్స్, తెలివిని ఉపయోగించి ప్రమాదాల నుంచి బయటపడుతుంటారు. చాకచక్యంగా వ్యవహరిస్తుంటారు. సన్నని, ఇరుకైన దారుల్లోనూ అద్భుతంగా డ్రైవింగ్ చేస్తారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) చాలానే ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ క్లిప్ చూసిన తర్వాత నెటిజన్లు డ్రైవర్ వాహనం నడిపే తీరును ప్రశంసిస్తారు. వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో ఒక డ్రైవర్ ప్రమాదకరమైన వంతెనపై ట్రక్కును నడుపుతున్నాడు. చిన్న పొరపాటు జరిగినా ట్రక్కు నేరుగా నదిలో పడిపోయేది. కానీ అది జరగుకండా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. ఓ నదిపై ఒక వంతెన ఉంది. దానికి రెయిలింగ్ కూడా లేదు. అదే వంతెనపై ఓ డ్రైవర్ లారీ నడిపి నదిని దాటుతాడు. వంతెనపై ట్రక్కు వెళ్తున్న సమయంలో బ్రిడ్జి కదులుతున్నట్లు కనిపిస్తుంది. కానీ డ్రైవర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే విశాలమైన రహదారిపై డ్రైవింగ్ చేస్తున్నట్లు ఉంది.

ఇరుకైన రోడ్లపై డ్రైవింగ్ చేయడం మీరు చూసే ఉంటారు. కానీ ఇలాంటి ప్రమాదకరమైన వంతెనపై డ్రైవింగ్ చేయగల నైపుణ్యం చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటాయని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ అయింది. 42 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు 76 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది ఈ వీడియోను లైక్ చేసి రకరకాల రియాక్షన్స్ ఇస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..