Video Viral: వామ్మో ఇదెక్కడి యాక్సిడెంట్ రా నాయనా.. చూస్తేనే గుండె దడ పుడుతోంది.. వీడియో చూసేయండి..

|

Jan 30, 2023 | 5:01 PM

రోడ్డుపై వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవ్ చేసేవారు బండి నడపడం పైనే దృష్టి పెట్టాలి. పరధ్యానంగా ఉండకూడదు. ఎందుకంటే ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. బైక్ పై వెళ్లినా.. కారులో వెళ్లినా..

Video Viral: వామ్మో ఇదెక్కడి యాక్సిడెంట్ రా నాయనా.. చూస్తేనే గుండె దడ పుడుతోంది.. వీడియో చూసేయండి..
Car Accident Video
Follow us on

రోడ్డుపై వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవ్ చేసేవారు బండి నడపడం పైనే దృష్టి పెట్టాలి. పరధ్యానంగా ఉండకూడదు. ఎందుకంటే ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. బైక్ పై వెళ్లినా.. కారులో వెళ్లినా.. ఆఖరుకు నడుచుకుంటూ వెళ్లినా.. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు కొన్ని సార్లు తీవ్ర పరిణామాలు మిగుల్చుతున్నాయి. కొన్ని సార్లు ప్రాణాలు బలి తీసుకుంటుంటే మరికొన్ని సార్లు జీవర్ఛవంలా మారుస్తున్నాయి. ప్రమాదాలు పలు రకాలు అన్నట్లు… ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్న ఒక యాక్సిడెంట్‌ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. రోడ్డుపై ఓ పికప్‌ వ్యాన్‌ వెళ్తోంది. దాని వెనుకే ఓ బ్లాక్‌ కలర్‌ పోలీస్‌ ఛేజ్‌ చేస్తూ దూసుకొస్తోంది. ఇది గమనించిన ఆ వ్యాను డ్రైవర్‌ పోలీసులనుంచి తప్పించుకునేందుకు తన వ్యానును మరింత వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో ఆ వ్యాను పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. అలా పల్టీలు కొడుతూనే నాలుగు చక్కాలు యధాస్థితిలో రోడ్డుపైకి వచ్చి పడింది. అంతే డ్రైవర్‌ ఇక ఆగేది లేదంటూ పోలీసులనుంచి తప్పించుకుని వేగంగా కారు నడుపుకుంటూ వెళ్లిపోయాడు.

ఇవి కూడా చదవండి

ఎక్సిడెంట్స్‌ ఫేటల్స్‌ అనే ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనపై నోరెళ్లబెట్టారు. ఆ వాహనంలోని డ్రైవర్‌ అదృష్టవంతుడని కామెంట్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..