Viral Video: షాకింగ్ యాక్సిడెంట్.. రైల్వే ట్రాక్ దాటుతున్న ట్రక్కు.. ఇంతలో వచ్చిన ట్రైన్.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Viral Video: రైలుకు.. లారీ ఎదురెళ్లినా.. లారీ.. రైలుకు ఎదురెళ్లినా నష్టం లారీకే. తాజాగా ఓ భారీ ట్రక్కు రైలు పట్టాలపై నిలిచిపోవడం భీకర ప్రమాదం చోటు చేసుకుంది.
Viral Video: రైలుకు.. లారీ ఎదురెళ్లినా.. లారీ.. రైలుకు ఎదురెళ్లినా నష్టం లారీకే. తాజాగా ఓ భారీ ట్రక్కు రైలు పట్టాలపై నిలిచిపోవడం భీకర ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన భీకర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విండ్ టర్బైన్ తీసుకెళ్తున్న 18 చక్రాల సెమీ ట్రక్కను హైస్పీడ్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రక్క్ ధ్వంసమైంది. సెకన్ల వ్యవధిలోనే చోటు చేసుకున్న భయానక ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికాలోని టెక్సాస్‌లో 18 చక్రాల సెమీ ట్రక్కు.. విండ్ టర్బైన్‌ను తీసుకెళ్తుంది. అయితే, ఆస్టిన్‌కు దక్షిణాల 50 మైళ్ల దూరంలో ఉన్న లూలింగ్ డౌన్‌లో ఒకచోట ఆ ట్రక్కు రైల్వే ట్రాక్‌ను దాటాల్సి వచ్చింది. ఇంతలో ఆ ట్రక్కు క్రాసింగ్ మధ్యలో చిక్కుకుపోయింది. అదే సమయంలో రైలు వస్తుండటంతో క్రాసింగ్ గేట్ క్లో్జ్ అయ్యింది. రైలు రాకను గమనించిన ట్రక్కు డ్రైవర్.. రైలు పట్టాలు దాటించేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటీకే ట్రక్కును సమీపించిన హైస్పీడ్ రైలు.. విండ్ టర్బైన్‌ను ట్రక్కును ఢీకొట్టింది. ఆ ట్రక్కును ఈడ్చుకెళ్తూ రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ట్రక్కు వెనుకవైపు ఉన్న విండ్ టర్బైన్ పూర్తిగా ధ్వంసం అవగా.. ట్రక్కు ఇంజిన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అక్కడి పోలీసులు తెలిపారు. రైలు వెళ్లిపోయిన తరువాత.. ధ్వంసమైన ట్రక్కును పక్కకు తొలగించారు అధికారులు. కాగా, ఈ ఘటనను వీడియో తీసిన ఇతరులు దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
ఇదిలాఉంటే.. ఇలాంటి ప్రమాదమే ఓహియోలోని ఓ రైల్వే క్రాసింగ్ వద్ద చోటు చేసుకుంది. ఇదే రీతిలో సెమీ ట్రక్కును ట్రైన్ ఢీకొట్టింది. ఓహియోలోని కొలంబస్ గ్రోవ్‌లోని సైకామోర్ స్ట్రీట్‌లో సెమీ-ట్రక్ రైల్ రోడ్ లెవల్ క్రాసింగ్‌ని దాటడానికి ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రైలు వస్తున్న సమయంలోనే ట్రక్కు ఆ పట్టాలను దాటేందుకు ప్రయత్నించింది. అందలో క్రాసింగ్ గేట్లు పడటంతో.. ఆ ట్రక్కు చిక్కుకుపోయింది. ఇంతలో దూసుకువచ్చిన ట్రైన్.. ఆ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలోనూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు.
Viral Video:
Also read:
Assam Floods: అస్సాంను ముంచెత్తుతున్న వరదలు.. తినడానికి తిండి కూడా లేక జనం ఆర్తనాదాలు..
Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు.. నిండుకుండలా రిజర్వాయర్లు, చెరువులు..
Capricorn: మకర రాశి గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియన ఆసక్తికరమైన విషయాలు.. మీకోసం..