
సృష్టిలో అమ్మ ప్రేమని వర్ణించేందుకు మాటలు లేవు అని అంటారు. వంద మంది పిల్లలని కూడా ఎన్ని కష్టాలు పడి అయినా తల్లి పెంచుతుంది. అదే తల్లిని వంద మంది పిల్లలు కలిసినా చూడరు. ఇది నేటి మానవ సంబంధాల తీరు. కష్టపడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వివిధ కారణాలతో రోడ్డుమీద విడిచి పెట్టె ఘనలకు సంబంధించిన వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. అటువంటి ప్రబుద్ధులకు ఈ వీడియోను చూపిస్తే ఏమైనా కొంచెం మార్పు వస్తుందేమో.. ఎందుకంటే వైరల్ అవుతున్న వీడియోలో మెట్రో రైలులో ఒక మహిళ అలసి చిన్నగా నిద్రలోకి జారుకుంటే.. పక్కనే ఉన్న ఒక చిన్నారి బాలుడు.. అమ్మ పడిపోకుండా.. అమ్మకు మెలకువ రాకుండా చేతులతో పట్టుకుని సపోర్ట్ ఇచ్చాడు. ఈ హార్ట్ టచింగ్ దృశ్యం కోల్‌కతా మెట్రోలో కనిపించింది. ఈ వీడియో ఎక్స్ వేదికగా @Anwarali_0A అనే యూజర్ పోస్ట్ చేసి ఈ దృశ్యం నా హృదయాన్ని కదిలించిందని క్యాప్షన్ ఇచ్చాడు.
వైరల్ వీడియోలో ఒక మెట్రో రైలులో ఒక మహిళ తన ఏడేళ్ళ కొడుకుతో కలిసి ప్రయాణిస్తోంది. ఆ మహిళ చాలా అలసిపోయినట్లు ఉంది.. దీంతో ట్రైన్ లో సీటులో కూర్చుని చిన్నగా నిద్రలోకి జారుకుంది. అప్పుడు తల్లిపక్కన కూర్చున్న కొడుకు తన తల్లి నిద్ర మత్తులో ఎక్కడ కింద పడుతుందో అని భావించి తల్లిని చేతులతో పట్టుకుని సపోర్ట్ ఇచ్చాడు. అదే సమయంలో తల్లి తల ట్రైన్ కుదుపుకి మెట్రోలో సపోర్ట్ కోసం పట్టునే రాడ్ కి తగలకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అమ్మ పట్ల ఆ చిన్నారి ప్రేమ, తీసుకున్న కేరింగ్ చూపరులను ఆకట్టుకుంది.
बच्चे का मां के लिए प्यार❤️ pic.twitter.com/1zoY8UnMA1
— Anwar Ali (@Anwarali_0A) September 4, 2025
దాదాపు 4 నిమిషాల నిడివిగల వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. బాలుడు తన అమ్మ నిద్రపోయినంత సేపు చాలా జాగ్రత్తగా.. ఎలాంటి హాని కలగకుండా చూసుకున్నాడు. ఈ బాలుడి ప్రేమకు నెటిజన్లు ఫిదా అయ్యారు. తల్లిదండ్రులంటే ప్రేమ.. వారిని రక్షించాలనే తలపు ఉండాలంటే .. పిల్లలకు తాము పడే కష్టం తెలియకుండా పెంచడం కాదని.. పిల్లల భవిష్యత్ కోసం తాము పడే కష్టం తెలిసేలా ప్రేమని అందిస్తూ తల్లిదండ్రులు ఎటువంటి లోపం లేకుండా పిల్లల్ని పెంచితే ఇలాంటి గుణవంతులు అవుతారని నెటిజన్‌లు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..