Watch Video: వార్ని.. బొమ్మ కారు నడిపితే ప్రపంచ రికార్డు..! ఇకపై అందరూ ట్రై చేస్తారేమో..?

|

Feb 19, 2024 | 6:37 PM

ఇప్పటి వరకు మీరు బైక్‌లు, సైకిళ్లు, కార్లు నడుపుతున్న చాలా మంది డ్రైవర్‌లను చూసి ఉంటారు. కానీ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి బొమ్మ కారును అత్యంత వేగంగా నడిపించి రికార్డ్ సాధించిన తీరు అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ వీడియో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు షేర్‌ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch Video: వార్ని.. బొమ్మ కారు నడిపితే ప్రపంచ రికార్డు..! ఇకపై అందరూ ట్రై చేస్తారేమో..?
Fastest Ride On Toy Car
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా రికార్డులను నమోదు చేసే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎప్పుడూ ప్రత్యేకమైన రికార్డులను నమోదు చేస్తుంది. ఎక్కువగా అసాధ్యం అనుకునే కొన్ని పనులు చేస్తూ ప్రజలు గిన్నిస్‌ బుక్‌లో వారి పేరు నమోదు చేసుకుంటారు.. కొందరు కొబ్బరి కాయలు తలపై కొట్టుకుంటూ, ఏదైనా ఆహారం అతిగా తినటం, ఆకారంలో అరుదైన రూపం, నీటి అడుగున మాయాజాలం చేయడం, గంటల పాటు మంచులో నిలబడి ఉండటం, ఎత్తైన భవనాలు క్షణాల్లో ఎక్కుతూ అందరినీ షాక్‌ అయ్యేలా చేయటం ఇలా ఎన్నో రికార్డులు ఇందులో నమోదయ్యాయి. అలా ఇప్పుడు ఈ పుస్తకంలో ఓ అపూర్వ రికార్డు నమోదైంది. ఇందులో ఓ వ్యక్తి బొమ్మ కారును ఉపయోగించి గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. అతడు చేసిన పని చూస్తూ మీరు కూడా అవాక్కై ముక్కున వేలేసుకుంటారు.. వివరాల్లోకి వెళితే..

ఇప్పటి వరకు మీరు బైక్‌లు, సైకిళ్లు, కార్లు నడుపుతున్న చాలా మంది డ్రైవర్‌లను చూసి ఉంటారు. కానీ, జర్మనీకి చెందిన మార్సెల్ పాల్ అనే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యార్థి ఓ చిన్న ఎలక్ట్రిక్ టాయ్ కారును నడిపి ప్రపంచ రికార్డు సృష్టించాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసిన వీడియోలో, ముందుగా మనకు ఒక ఎలక్ట్రిక్ కారును ఏర్పాటు చేస్తున్న వ్యక్తిని చూడవచ్చు. అయితే, ఈ చిన్న కారును స్టార్ట్ చేసి తర్వాత అతడు దాదాపు పడుకున్న స్థితిలో ఫీల్డ్‌లో నడుపుతున్నాడు.. ఈ అద్వితీయమైన గిన్నిస్ రికార్డును మీరూ ఒక్కసారి చూడండి.

ఇవి కూడా చదవండి

ఈ ఎలక్ట్రిక్ టాయ్ కారును నడపడం ద్వారా అతడు ‘ఫాస్టెస్ట్ రైడ్ ఆన్ టాయ్ కార్’ టైటిల్‌ను గెలుచుకున్నాడు. రైడింగ్ కోసం ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును ఉపయోగించిన వ్యక్తి గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. ఈ సమయంలో మార్సెల్ పాల్ అత్యంత వేగవంతమైన రైడ్ 148.454 km/h (92.24 mph); అని క్యాప్షన్‌లో ప్రస్తావించబడింది.

మార్సెల్ పాల్ జర్మనీకి చెందినవాడు, ఫుల్డా యూనివర్శిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థి. ఈ ప్రయోగం చేయడానికి ముందు పది నెలల పాటు పరిశోధనలు చేసి సాధన చేశారట. ఈ వీడియో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు షేర్‌ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..