Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదెక్కడి పిచ్చండీ బాబు.. లైక్‌ల కోసం ఇలా కూడా చేస్తారా! ఏమాత్రం అంచనా తప్పినా తల పగిలేది.

Viral Video: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ప్రతీ ఒక్కరూ ఎక్కడ లేని స్టేటస్‌ను కోరుకుంటున్నారు. తాము పోస్ట్ చేసిన ఫోటోలకు, వీడియోలకు లైక్‌లు రావాలని ఆశిస్తున్నారు. లైక్‌లు రాకపోతే...

Viral Video: ఇదెక్కడి పిచ్చండీ బాబు.. లైక్‌ల కోసం ఇలా కూడా చేస్తారా! ఏమాత్రం అంచనా తప్పినా తల పగిలేది.
Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 26, 2021 | 9:01 AM

Viral Video: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ప్రతీ ఒక్కరూ ఎక్కడ లేని స్టేటస్‌ను కోరుకుంటున్నారు. తాము పోస్ట్ చేసిన ఫోటోలకు, వీడియోలకు లైక్‌లు రావాలని ఆశిస్తున్నారు. లైక్‌లు రాకపోతే కృంగిపోయే వారు కూడా ఉన్నారంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇక సోషల్‌ మీడియాలో లైక్‌ల కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. ఇందుకోసం కొన్ని సమయాల్లో ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారు కొందరు. మరీ ముఖ్యంగా టిక్‌టాక్‌ వంటి వీడియో షేరింగ్‌ యాప్‌లు వచ్చిన తర్వాత ఈ పిచ్చి మరింత ఎక్కువైంది. ఏం చేసైనా సరే వ్యూస్‌ పెంచుకోవడమే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. ఇలా చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఇప్పటికే చాలా చూశాం.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఓ వీడియోను చూస్తే ఇదే అనిపిస్తోంది. లైక్‌ల కోసం ఇంతలా చేస్తారా.? అన్న ప్రశ్న వస్తోంది. ఎమ్‌ఎక్స్‌ టకాటక్‌ అనే యాప్‌లో ఓ జంట వీడియోను రూపొందించారు. ఈ వీడియోలో ఓ అమ్మాయి చెట్టు కొమ్మపై నిల్చొని ఉండగా, అబ్బాయి చెట్టు కింద ఉన్నాడు. ఇక అమ్మాయి అటువైపు నిల్చొని వెనక్కి చూడకండా, కిందికి పడిపోయింది. దీంతో కింద ఉన్న అబ్బాయి, అమ్మాయిని తన రెండు చేతుల్లోకి క్యాష్‌లా పట్టుకున్నాడు. అయితే అంతా బాగానే ఉంది కానీ… ఏ మాత్రం అంచనా తప్పినా అమ్మాయి తల పగిలిపోయేది. లైక్‌ల కోసం ఇలా ప్రాణాలను ఫణంగా పెట్టడం అవసరమా అని ఈ వీడియో చూసిన వారు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియోను మీరూ ఓసారి చూసేయండి.

వైరల్ వీడియో..

Also Read: e-Shram: అసంఘటిత రంగ కార్మికులకు గుడ్‌న్యూస్.. ఇ-లేబర్ పోర్టల్‌ను ప్రారంభించనున్న కేంద్రం..

Covid-19 Vaccine: నెలనెలా రూ.15వేలు చెల్లించండి.. వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఆ సంస్థ

Fuel Price in India: ఉపశమనం..! పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం