Viral Video: మయన్మార్‌లో అరుదైన తెల్ల ఏనుగు జననం… వారెవ్వా ఎంత క్యూట్‌గా ఉందో చూడండి..

|

Aug 04, 2022 | 4:03 PM

Rare Elephant: సరిగ్గా 12 రోజుల క్రితం అంటే జులై 23వ తేదీ ఉదయం ఆరు గంటల 30 నిమిషాలకు మయన్మార్ లోని పశ్చిమ తీరం రాఖైన్‌లో ఆ అరుదైన ఏనుగు జన్మించింది.

Viral Video: మయన్మార్‌లో అరుదైన తెల్ల ఏనుగు జననం... వారెవ్వా ఎంత క్యూట్‌గా ఉందో చూడండి..
White Elephant
Follow us on

White Elephant: మయన్మార్ దేశంలో అరుదైన తెల్ల ఏనుగులను ఆ దేశ ప్రజలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. వీటిని పెంచుకుంటే అదృష్టం కలిసొస్తుందనేది వారి విశ్వాసం. సరిగ్గా 12 రోజుల క్రితం అంటే జులై 23వ తేదీ ఉదయం ఆరు గంటల 30 నిమిషాలకు మయన్మార్ లోని పశ్చిమ తీరం రాఖైన్‌లో ఓ తెల్ల ఏనుగు జన్మించింది. జర్ నాన్ హ్లా అని పిలవబడే 33 ఏళ్ల తల్లి ఏనుగు మగ గున్న ఏనుగుకు జన్మనిచ్చింది. ఇది రెండున్నర అడుగుల పొడవు.. మూడు అడుగుల వెడల్పుతో ఉంది. ఆగ్నేసియా సంస్కృతిలో తెల్ల ఏనుగులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. చూడటానికి ఎంతో క్యూట్ గా కనబడుతోంది ఈ గున్న ఏనుగు.

పశ్చిమ తీరం రాఖైన్‌ లో మయన్మార్ టింబర్ ఎంటర్ ప్రైజ్ సంరక్షణలో ఏనుగు ఉండగా.. ఇప్పుడు దానికి జన్మించిన గున్న ఏనుగుకు అరుదైన తెల్ల ఏనుగుకు ఉండే ఎనిమిది లక్షణాల్లో ఏడు ఉన్నట్లు మయన్మార్ కు చెందిన ఓ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ గున్న ఏనుగు ముత్యపు రంగు కళ్ళు, అరటి కొమ్మ ఆకారంలో వీపు, తెల్లటి జుట్టు, విలక్షణమైన తోక, ముందు కాళ్లపై ఐదు పంజాలు, వెనుక కాళ్లపై నాలుగు పంజాలు, పెద్ద చెవులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

చారిత్రకంగానూ ఆగ్నేయాసియా సంస్కృతిలో తెల్ల ఏనుగులను చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. శక్తికి చిహ్నంగా వీటిని గౌరవిస్తారు. మయన్మార్ సైనిక నిర్మిత రాజధాని నైపిడాలో ప్రస్తుతం ఆరు తెల్ల ఏనుగులు ఉన్నట్లు ఆ దేశ మీడియా ప్రకటించింది. ఇప్పుడు ఈ తెల్ల ఏనుగు పిల్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పబ్లిక్ డొమైన్ లో ఈ ఏనుగుకు సంబంధించిన ఎక్కువ చిత్రాలు పెట్టనప్పటికి.. మయన్మార్ స్టేట్ మీడియా ఒక వీడియో ఫుటేజీ విడుదల చేసింది. దీనిలో పిల్ల ఏనుగు తన తల్లిని నదికి వెంబడించడం….. వాటిని సంరక్షకులు శుభ్రం చేస్తుండటంతో పాటు.. తన తల్లి నుంచి గున్న ఏనుగు ఆహారం తీసుకోవడం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తలు చదవండి..