AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: ‘చెవి’తో కూడా పాలు తాగుతారా? వీడియో చూసిన నెటిజన్ల మైండ్ బ్లాంక్..!

సాధారణంగా పాలు ఎలా తాగుతారు అని అడిగితే ఏం చెబుతారు? ఎవరైనా సరే నోటితోనే అని సమాధానం చెబుతారు. కానీ, ఇక్కడ ఓ మాతృమూర్తి మాత్రం.. తన చంటి బిడ్డకు చెవి ద్వారా పాలు తాగిస్తోంది.

Funny Video: ‘చెవి’తో కూడా పాలు తాగుతారా? వీడియో చూసిన నెటిజన్ల మైండ్ బ్లాంక్..!
Baby Feeding
Shiva Prajapati
|

Updated on: Dec 24, 2022 | 6:41 AM

Share

సాధారణంగా పాలు ఎలా తాగుతారు అని అడిగితే ఏం చెబుతారు? ఎవరైనా సరే నోటితోనే అని సమాధానం చెబుతారు. కానీ, ఇక్కడ ఓ మాతృమూర్తి మాత్రం.. తన చంటి బిడ్డకు చెవి ద్వారా పాలు తాగిస్తోంది. అవును, అదెలాగంటారా? అయితే, ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు హవ్వ అనుకుంటున్నారు. అదే సమయంలో.. అందులో కనిపిస్తున్న ఆ మాతృమూర్తి తీరుపై కొంచెం ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. అవును, ఆమె చేసిన పని అలా ఉంది మరి. చిన్నారికి పాలు పట్టించాల్సిన ఆ తల్లి.. కబుర్లలో మునిగిపోయి వింత పని చేసింది. నోటితో తాపాల్సిన పాలను చెవితో తాగించే ప్రయత్నం చేసింది. పిల్లలకు పాలు తాగించే పాల డబ్బాను నోట్లో పెట్టకుండా.. చిన్నారి చెవిలో పెట్టింది. ఇక తన పాటికి తాను పక్కన వారితో కబుర్లు చెబుతోంది. చిన్నారి పాలు తాగుతుందా? లేదా? అసతు తాను ఎక్కడ డబ్బా పెట్టాను అనే సోయే లేకుండా.. ముచ్చట్లలో మునిగిపోయింది. అయితే, ఈ తతంగాన్నంతా పక్కనే ఉన్న కొందరు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది.

అయితే, చిన్నారికి పాలు పట్టించిన తల్లి కాసేపటికి తేరుకుని, అయ్యో అని నాలుక కరుచుకుంది. వెంటనే పాల డబ్బాను నోట్లో పెట్టి చిన్నారికి పాలు తాగించింది. తాను చేసిన పనికి సిగ్గుపడుతూ నవ్వుకుంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమె వ్యవహరించిన తీరుపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పిల్లల విషయంలో ఇలా వ్యవహరించడం ఏంటంటూ కొందరు సీరియస్ అవుతుంటే.. కబుర్లుంటే చాలు ప్రపంచంతో సంబంధమే ఉండదని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.

తన బిడ్డకు విచిత్ర రీతిలో పాలు పట్టిస్తున్న తల్లి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!