Viral Video: వాహ్.. ఏం బ్రెయిన్ సామీ నీది.. క్కిక్కిరిసిన రైలులో ప్రత్యేక బెడ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.. అదెలాగో చూస్తే షాక్ అవుతారు..!

Viral Video: కళ్ళు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు.. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు.. అని ఒక సినిమా డైలాగ్ ఉంటుంది. ఇది అక్షర సత్యం.. నిజంగా దిమాక్ ఉండాలే గానీ..

Viral Video: వాహ్.. ఏం బ్రెయిన్ సామీ నీది.. క్కిక్కిరిసిన రైలులో ప్రత్యేక బెడ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.. అదెలాగో చూస్తే షాక్ అవుతారు..!
Man Tallent

Viral Video: కళ్ళు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు.. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు.. అని ఒక సినిమా డైలాగ్ ఉంటుంది. ఇది అక్షర సత్యం.. నిజంగా దిమాక్ ఉండాలే గానీ.. ఎలాంటి పరిస్థితులను అయినా మనకు అనుకూలంగా మార్చేసుకోవచ్చు. తాజాగా ఓ వ్యక్తి ఆ పని చేసే.. నెట్టింట్లో తెగ రచ్చ చేస్తున్నాడు. అందరూ అవస్థలు పడుతూ ఉంటే.. అతను మాత్రం తన బుర్రకు పదును పెట్టి హాయిగా ఎంజాయ్ చేశాడు. ఇంతకీ అతను ఏం చేశాడు? ఎందుకంత పొగడ్తలు? అనేగా మీ సందేహం. ఇప్పుడు ఆ విషయానికే వెళ్దాం పదండి.

రైలు ప్రయాణం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. కిక్కిరిసే ప్రయాణికులతో.. కాలు పెట్టే సందు కూడా ట్రైన్‌లో ఉండదు. జనరల్ బోగీల్లో మాత్రమే ఈ పరిస్థితి ఉంటుంది. అయితే, తాజాగా రైలు ఎక్కిన ఓ వ్యక్తి.. తన టాలెంట్‌తో పరిస్థితులను పూర్తిగా తనవైపు తిప్పేసుకున్నాడు. అదెలాగంటే.. రైలు కోచ్‌లో సీట్లు అన్నీ నిండిపోయాయి. పడుకుందాం అంటే ప్లేస్ లేదు. దాంతో ఓ ప్రయాణికుడు తన బుర్రకు పని చెప్పాడు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా.. తన దుబ్బట్టాను.. లగేజీ హోల్డర్‌కు అటు చివర, ఇటు చివర బలంగా కట్టాడు. ఉయ్యాల మాదిరిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తరువాత అందులో హాయింగా తొంగున్నాడు. అది చూసిన మిగతా ప్రయాణికులు కంగుతిన్నారు. ఏం తెలివిరా నాయనా నీది అని ముక్కున వేలేసుకున్నారు.

అయితే, ఆ వ్యక్తి ఇలా తనకంటూ ప్రత్యేక బెర్త్‌ని క్రియేట్ చేసుకోవడాన్ని రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తులు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. అతని తెలివికి, సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. రైలులో ప్రయాణించే ప్రయాణకులు తమకెప్పుడైనా సీటు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటే.. ఇలా ప్రయత్నించొచ్చు అంటూ నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి సామీ అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. ఈ వీడియోను memes.bks అనే ఇన్‌స్టాగ్రమ్‌ అకౌంట్‌లో షేర్ చేయగా. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 74 వేల మందికిపైగా నెటిజన్లు వీక్షించగా.. వేలాది లైక్స్ వచ్చాయి.

Viral Video:

 

View this post on Instagram

 

A post shared by MEMES.BKS🤟🙂 (@memes.bks)

Also read:

Aadi Saikumar: నయా మూవీ మొదలు పెట్టిన యంగ్ హీరో.. రెగ్యులర్ షూటింగ్‌లో ఆది సాయికుమార్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్

Keerthy Suresh : చీరకట్టు.. చిరునవ్వు.. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న ముద్దుగుమ్మ..

Akhanda: బాలయ్య యాక్షన్‌కు థియేటర్స్ దద్దరిలాల్ల్సిందే.. అఖండలో నటసింహం విశ్వరూపం చూపించనున్నారట..

Click on your DTH Provider to Add TV9 Telugu