Viral Video: ఆయన కనిపిస్తే చాలు సంబరపడిపోతున్న పక్షులు, జంతువులు.. నిజమైన పక్షి రాజు వచ్చేశాడు..

ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో 2.O సినిమా గుర్తుందా? పక్షులు అంతరించిపోవడం, అందుకు గల కారణాల నేపథ్యంలో తీసిన ఈ సినిమాలో ‘పక్షి’ రాజు క్యారెక్టర్ చాలా కీలకమైనది.

Viral Video: ఆయన కనిపిస్తే చాలు సంబరపడిపోతున్న పక్షులు, జంతువులు.. నిజమైన పక్షి రాజు వచ్చేశాడు..
Animal Lover

Updated on: Dec 24, 2022 | 6:08 AM

ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో 2.O సినిమా గుర్తుందా? పక్షులు అంతరించిపోవడం, అందుకు గల కారణాల నేపథ్యంలో తీసిన ఈ సినిమాలో ‘పక్షి’ రాజు క్యారెక్టర్ చాలా కీలకమైనది. సినిమా మొత్తం పక్షిరాజుతోనే నడుస్తుంది. అందులో విల్ అయిన అక్షయ్ కుమార్‌కు చిన్నప్పటి నుంచే పక్షులంటే ప్రాణం. వాటితో మమేకమైన జీవించేవాడు. నిద్రలేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు వాటితోనే ఎక్కువగా గడిపేవాడు. ఎప్పుడూ అతని చుట్టూ రకరకాల పక్షలు ఉంటుండేవి. అతనితో ఉంటే.. చాలా సంతోషంగా కనిపించేవి. ఇదంతా సినిమాలో కనిపించే దృశ్యాలు మాత్రమే. కానీ, నిజ జీవితంలోనూ ఇలాంటి పక్షిరాజు ఒకరున్నారని మీకు తెలుసా? అవును, మీరు వినేది నిజంగా నిజం. ఆ పక్షి రాజు చూడగానే.. పక్షులన్నీ అతని చెంతకు వస్తాయి. పక్షులే కాదు.. ఉడుత వంటి చిన్న చిన్న జంతువులు సైతం అతని వద్దకు ప్రేమగా వస్తాయి. అతని మీదకు వచ్చి ఆడుకుంటాయి. అతను వేసే ఆహారాన్ని కడుపునిండా ఆరగిస్తాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజంగా అద్భుతం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

సోనియా అనే ట్విట్టర్ యూజర్ ఈ బ్యూటీఫుల్ వీడియోను షేర్ చేసింది. ఓ వ్యక్తి తన చేతిలో ఒక బ్యాగు పట్టుకుని వచ్చాడు. నిర్మానుష్య ప్రాంతంలో కూర్చుని ఆ బ్యాగు జిప్ తీశాడు. ఆ వెంటనే అతని చుట్టూ పక్షలు, ఉడతలు వచ్చి చేరడం మొదలైంది. అతను తన బ్యాగులోంచి ధాన్యపు గింజలను తీసి.. ఆ పక్షులు, ఉడుతలకు మేతగా వేశాడు. వందలాది పక్షులు అతన్ని చుట్టుముట్టాయి. కొన్ని పక్షులు, ఉడుతలు అతనిపై వాలగా.. మరికొన్ని అతను వేసిన గింజలను తింటున్నాయి. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. ఈ జంతు ప్రేమికుడిని చూసి నెటిజన్లు అబ్బురపడిపోతున్నారు. పక్షుల ప్రేమను పొందిన ఇతను నిజంగా లక్కీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

పక్షులతో సరదాగా వ్యక్తి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..