Viral Video: ఎలాంటి కల్మషం లేని అందమైన మనస్సుకు చిన్న పిల్లలు పెట్టింది పేరు. మరీ ముఖ్యంగా వచ్చీ రానీ మాటలతో వారు పలికే పలుకులు ఫిదా చేస్తుంటాయి. ఎంత బాధలో ఉన్నా సరే కాసేపు చిన్న పిల్లలతో గడిపితే ఒత్తిడి పరార్ అవ్వాల్సిందే. అంతలా ఆకట్టుకుంటాయి చిన్న పిల్లల మాటలు. తాజాగా నెట్టింట అలాంటి ఓ కుర్రాడి బుజ్జి బుజ్జి పలుకులు వైరల్ అవుతున్నాయి. ఈ కుర్రాడి మాటలు విన్న నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. సుమారు ఓ రెండేళ్ల వయసున్న కుర్రాడిని తల్లి భోజనం చేయించడానికి తీసుకెళుతూ.. ‘నువ్వు రోటి సబ్జీ తింటావా.? లేదా అన్నం, పప్పు తింటావా?’ అని ప్రశ్నిస్తుంది. దానికి ఆ కుర్రాడు.. ‘నో.. నో థ్యాంక్యూ నేను అది తినను. నేను కేక్ తింటాను. ఈ ఒక్కసారికి కేక్ తింటాను’ అని చెబుతాడు. ఆ కుర్రాడు వచ్చి రానీ మాటలతో పలికిన ఆ పదాలు మెస్మరైజ్ చేస్తున్నాయి. దీనంతటినీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఆ కుర్రాడు అడిగిన తీరు చూస్తుంటే ఒక్క కేక్ ఏంటి.? వంద కేకులు అయినా ఇవ్వాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఆ బుడ్డోడి క్యూట్ క్యూట్ మాటలను మీరూ ఓ సారి వినేయండి..
Also Read: Viral Video: ఈ వీడియో చూస్తే మీ పెంపుడు కుక్కతో అస్సలు జోక్ చేయరు.. ఎందుకో తెలుసా..
T20 World Cup 2021: బౌలర్ల వరల్డ్ కప్‌లో బ్యాట్స్‌మెన్స్ విలవిల
T20 World Cup 2021: బౌలర్ల వరల్డ్ కప్‌లో బ్యాట్స్‌మెన్స్ విలవిల