దేవుడి ఆశీస్సులు పొందేందుకు ప్రజలు తరచూ ఆలయాలకు వెళ్తుంటారు. కొన్నిసార్లు భక్తులు దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఛాలెంజింగ్ పనులు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి ఏనుగు విగ్రహం కాళ్ల మధ్య నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ, పాపం ఆ వ్యక్తి బయటకు రాలేక ఏనుగు విగ్రహం కాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. ఈ వీడియోను నితిన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఘటన గుజరాత్‌లో జరిగినట్లు సమాచారం. ఆ వ్యక్తి విగ్రహం లోపల ఇరుక్కుపోవడంతో ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయాడు.
వీడియోలో, ఓ వ్యక్తి గుడి ఆవరణలోని ఏనుగు విగ్రహం కాళ్ల మధ్యల్లోంచి దూరి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. చేతులు సహా నడుము వరకు బయటపడ్డాడు. కానీ, పాపం ఆ తర్వాత ఇటు బయటకు రాలేక, అటు వెనక్కి వెళ్లలేక నరకయాతనపడ్డాడు. చేతులు,శరీరాన్ని ఉపయోగిస్తూ విపరీతంగా ట్రై చేశాడు. పూజారులు కూడా వ్యక్తి విగ్రహం నుండి బయటకు లాగేందుకు సహాయం చేస్తున్నారు. గుడికి వచ్చిన చాలా మంది భక్తులు, స్థానికులు సైతం పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. బాధిత భక్తుడికి ఇలా చేయ్, అలా ట్రై చేయ్ అంటూ సలహాలను ఇవ్వడం చూడవచ్చు. ప్రజలు సాయం చేసినా భక్తుడు విగ్రహం నుంచి బయటకు రాలేకపోయాడు. వీడియో చివరి వరకు అలాగే ఉండిపోయాడు. ఆ వ్యక్తి విగ్రహం నుంచి బయటపడ్డడా లేదా..? అనేది వీడియోలో స్పష్టంగా లేదు. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు లక్షల మంది వీడియోని వీక్షించారు.
Any kind of excessive bhakti is injurious to health ? pic.twitter.com/mqQ7IQwcij
— ηᎥ†Ꭵղ (@nkk_123) December 4, 2022
గతంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 2019లో ఓ మహిళా భక్తురాలు ఆచారంలో భాగంగా చిన్న ఏనుగు విగ్రహం కాళ్ల మధ్యలోంచి దూరేందుకు ప్రయత్నించి ఇరుక్కుపోయింది. ఆమె విగ్రహం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె బయటకు రాలేకపోయింది. ప్రజలు ఆమెను రక్షించలేకపోయారు. పాత వీడియో ప్రకారం చాలా ప్రయత్నించిన తర్వాత గానీ, ఆమె క్షేమంగా తప్పించుకోగలిగింది. ఆమె ప్రయత్నానికి భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి