Viral News: వేలం పాటలో రూ. 31 వేలు పలికిన మామిడి కాయలు.. అంత ప్రత్యేకత ఏంటనేగా.?

Viral News: మీకు తెలిసినంత వరకు ఒక బాక్స్‌ మామిడి కాయల ధర ఎంత ఉంటుంది చెప్పండి. ఏముంది మహా అయితే రూ. 200 లేదా ఇంకా అంటే ఓ రూ. 500 అంటారా.? అలాకాకుండా బాక్స్‌ మామిడి కాయలు ఏకంగా రూ. 30 వేలకు అమ్ముడుపోతే..

Viral News: వేలం పాటలో రూ. 31 వేలు పలికిన మామిడి కాయలు.. అంత ప్రత్యేకత ఏంటనేగా.?
Mangos

Updated on: Feb 12, 2022 | 7:02 PM

Viral News: వేసవి వస్తే విపరీతంగా ఎండలు ఉంటాయి. ఉక్కపోతగా ఉంటుంది అని తెలిసినా ఒక్క కారణం కోసం ఎండాకాలం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాం. ఎందుకంటే వేసవి వస్తూ వస్తూ తనతో పాటు మామిడి కాయలను తీసుకొస్తుంది కాబట్టి. మామిడి కాయలు, మామిడి పండ్లను ఇష్టపడని వారు ఎవరూ ఉండనరడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే మీకు తెలిసినంత వరకు ఒక బాక్స్‌ మామిడి కాయల ధర ఎంత ఉంటుంది చెప్పండి. ఏముంది మహా అయితే రూ. 200 లేదా ఇంకా అంటే ఓ రూ. 500 అంటారా.? అలాకాకుండా బాక్స్‌ మామిడి కాయలు ఏకంగా రూ. 30 వేలకు అమ్ముడుపోతే.. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ ఇది నిజంగానే జరిగింది.

వివరాల్లోకి వెళితే.. పుణెలో ఉన్న ఏపీఎమ్‌సీ మార్కెట్‌లో ప్రతీ ఏటా వేసవిలో వచ్చే మొదటి మామిడి కాయలను వేలం పాటకు వేస్తారు. ఎప్పటిలాగే ఈ సారి కూడా దేవ్‌గడ్‌ రత్నగిరి ప్రాంతం నుంచి మార్కెట్‌కు మామిడి కాయలు వచ్చాయి. దీంతో వేలంపాటు వేయగా బాక్సు మామిడి కాయలు ఏకంగా రూ. 31 వేలకు పలికింది. గడిచిన 50 ఏళ్లలో పలికి ధరల్లో అత్యధికం ఇదే కావడం విశేషం. శుక్రవారం నిర్వహించిన ఈ వేలంపాటలో యువరాజ్‌ కాచి అనే ట్రేడర్‌ మామిడి కాయలను వేలానికి ఉంచడంతో అనూహ్య ధరకు అమ్ముడు పోయాయి.

ఈ విషయమై ట్రేడర్‌ మాట్లాడుతూ.. ‘కరోనా కారణంగా గత రెండేళ్లుగా వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. మేము ఈ ఏడాది వ్యాపారం త్వరగా ప్రారంభించడానికి ఇదే కారణం’ అని చెప్పుకొచ్చారు. ఇక వేలంపాటలో భాగంగా రూ. 5000కు మొదలైన పాట ఏకంగా రూ. 31వేలకు చేరింది.

Also Read: Charu Sharma, IPL Auction 2022: వేలం పాట నిర్వహిస్తున్న చారు శర్మ ఎవరో తెలుసా..

Andhra Pradesh: మహిళ బాత్‌రూంలోకి తొంగి చూసిన పక్కింటి వ్యక్తి.. ఆమె భర్త నిలదీసేందుకు వెళ్లగా..

Bhishma Ekadashi: భీష్మ ఏకాదశి విశిష్టత.. ఈ పర్వదినం రోజున విష్ణు సహస్రనామాలు చదివితే కలిగే అద్భుత ఫలితం..