Funny Chimpanji: సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ జంతువుల చిత్రాలు అలాగే జంతువుల వీడియోలు ఉన్నాయి. అసలు జంతులోకం గురించి చెప్పుకోవాలంటే బోలెడు ఉంటుంది. ఒక్కసారి జంతు ప్రపంచంలోకి అడుగు పెట్టామా.. మనకి ఎన్నో అనుభూతులు కలుగుతాయి. జంతువుల కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి. మరి కొన్ని అందమైనవి ఉంటాయి. చాలా వీడియోలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి ఒక చింపాంజీ ఫన్నీ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఉంది. దీనిని చూస్తె నవ్వు ఆపుకోలేరు ఎవరూ. ఎందుకంటే, చింపాంజీ భారీగా ఉంటుంది. అది నడుస్తుంటేనె బద్ధకంగా నడిచినట్టు కనిపిస్తుంది. కానీ, ఈ వీడియోలో చింపాంజీ మాత్రం హుషారుగా ఉంది. పైగా పిల్లిమొగ్గలు వేసేస్తోంది. ఒకసారి ముందుకు.. ఒకసారి వెనక్కు.. ఇలా చింపాంజీ చేస్తున్న పిల్లిమొగ్గలు నవ్వు తెప్పిస్తున్నాయి.
What was that? pic.twitter.com/40oj6WlYKs
— Susanta Nanda IFS (@susantananda3) April 25, 2021
ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, ఈ చింపాంజీ పిల్లిమొగ్గలు వేయడం కూడా సున్నితంగా వేస్తూ ఉండటం. ఎదో వీడియో తీస్తున్నారు..దానికి ఫోజు ఇవ్వాలి అనే పద్ధతిలో ఈ చింపాంజీ చేసిన విన్యాసాలకు నెటిజన్లు ఫిదా అయిపోయారు.
ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఇది ఏమిటి?’ అని ఆయన రాసిన క్యాప్షన్‌తొ సోషల్ మీడియాలో ఈ ఫన్నీ వీడియో ప్రజలకు నచ్చుతోంది. ప్రజలు దీన్ని ఒకరికొకరు పంచుకోవడమే కాదు, దానిపై వివిధ వ్యాఖ్యలు చేస్తున్నారు. అదేవిధంగా షేర్ కూడా ఇస్తున్నారు. చింపాంజీ విన్యాసాలు చూసిన చాలా మంది వినియోగదారులు దీనిని జిమ్నాస్ట్ అని పిలిచారు. కొంతమంది చింపాంజీ సోమర్సాల్ట్‌ను చంపేస్తోందని వ్యాఖ్యానించారు.
What was that? pic.twitter.com/40oj6WlYKs
— Susanta Nanda IFS (@susantananda3) April 25, 2021
What was that? pic.twitter.com/40oj6WlYKs
— Susanta Nanda IFS (@susantananda3) April 25, 2021
Also Read: Special Trains: భారత రైల్వే కీలక నిర్ణయం .. పలు ప్రాంతాలకు 330 అదనపు ప్రత్యేక రైళ్లు
Social Distance: కరోనా కాలం..సామాజిక దూరం తప్పదు మరి..ఓ వరుడి సైకిల్ పై బారాత్..ప్రజలను ఆకట్టుకుంది!