సోషల్ మీడియాలో నిత్యం చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వీటిలో చాలా వీడియోలు భయపెడితే..కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తాయి మరి కొన్ని వీయోలు హృదయానికి హత్తుకుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే. తల్లిదండ్రులు పిల్లలను ఎంతో ప్రేమగా.. జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అలాగే పిలల్లు కూడా తల్లి దండ్రులు కూడా అంతే భద్రంగా చూసుకుంటూ ఉంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు. ఈ వీడియోను మిత్ ఇందుల్కర్ అనే వ్యక్తి షేర్ చేశాడు. ఈ వీడియో హృదయాలను తాకుతుంది. ఇంతకు ఈ వీడియోలో ఏముందంటే..
వైరల్ గా మారిన ఈ వీడియోలో ఓ చిన్నారి.. చూపులేని తన తల్లిదండ్రులకు సేవలందిస్తుంది. ఈ వీడియోకు 3.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియో ముంబైలోని మీరా రోడ్‌లో జరిగిన ఓ సంఘటన. స్కూల్ యూనిఫాం ధరించిన ఒక చిన్న అమ్మాయి తన దృష్టి లోపం ఉన్న తల్లిదండ్రులతో కూర్చోవడం మనం చూడవచ్చు.
వారు రోడ్డు పక్కన ఉన్న దుకాణం వద్ద బయట కూర్చుని స్నాక్స్ తింటున్నారు. ఆ చిన్నారి వారికి ఆ స్నాక్స్ అందించడం తో ఆతర్వాత తిన్న తర్వాత శుభ్రం చేయడం.. ఆ తర్వాత వారిని తీసుకొని జాగ్రత్తగా అక్కడ నుంచివెళ్లడం మనం చూడొచ్చు. వాళ్ళని చూసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను. ఆమె తల్లితండ్రులు అంధులు అయినా ఆ చిన్నారి కళ్లతో ప్రపంచాన్ని చూస్తున్నారు. ఆమె ఈ దుకాణానికి రావడం నేను ప్రతిరోజూ చూసేవాడిని. ఈ చిన్నారి మాకు చాలా విషయాలు నేర్పింది. మీరు మీ తల్లిదండ్రులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వారిని సంతోషంగా ఉంచాలి అని ఇందుల్కర్ రాసి వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో పై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..