Viral Video: తాత నువ్వు తోప్.. 96 ఏళ్ల మనవాడి పెళ్ళిలో దుమ్మురేగేలా డ్యాన్స్ చేశాడు.. వీడియో వైరల్

నేపాల్‌కు చెందిన 96 ఏళ్ల వృద్ధుడు తన మనవడి వివాహ వేడుకలో అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. అజ్జా సఖత్ డ్యాన్స్ స్టెప్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Viral Video: తాత నువ్వు తోప్.. 96 ఏళ్ల మనవాడి పెళ్ళిలో దుమ్మురేగేలా డ్యాన్స్ చేశాడు.. వీడియో వైరల్
96 Year Old Man Dancing

Updated on: Apr 18, 2023 | 7:31 AM

చనిపోయేలోపు మనవళ్ల పెళ్లి చూడాలన్నది చాలా మంది తాతయ్యల కల. ఆ కల నెరవేరితే వారి ఆనందానికి అవధులు ఉండవు. ఇందుకు చక్కటి ఉదాహరణగా నేపాల్‌కు చెందిన 96 ఏళ్ల వృద్ధుడు తన మనవడి వివాహ వేడుకలో అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. అజ్జా సఖత్ డ్యాన్స్ స్టెప్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోలు ఓ వృద్ధుడు డాన్స్ చేస్తూ కనిపించాడు.

వైరల్ వీడియోలో, తాత సాంప్రదాయ నేపాలీ పాటకు నృత్యం చేయడం చూడవచ్చు. వయసు కేవలం సంఖ్య అనే సామెతను ఈ తాత నిజం చేశాడు. 96 ఏళ్ల తాత తన మనవడి పెళ్లిలో డ్యాన్స్ చేసిన వైరల్ వీడియోను ఇక్కడ చూడండి

మార్చి 30న షేర్ చేసిన ఈ వీడియోకు 4591 లైక్‌లు వచ్చాయి. అలాగే, ఈ వయస్సులో కూడా అజ్జ ఎనర్జీని సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసిస్తున్నారు. “మీ తాత ఎల్లప్పుడూ సంతోషంగా , క్షేమంగా ఉండాలి” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.