‘‘పందెం మధ్యలో హీరో పడిపోవడం, ఆ తరువాత లేచి అనూహ్యరీతిలో పందెంను గెలవడం’’ ఇలాంటి సన్నివేశాలను మనం చాలా సినిమాల్లో చూస్తూనే ఉంటాం. అయితే నిజ జీవితంలో అలానే ఓ గుర్రం పందెంను గెలిచాడు బుడతడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
A nine-year-old boy, riding a galloping horse, fell off from it during a race. However, he immediately stood up and soon caught up with the still running horse by riding pillion on a bike that was following the animal. pic.twitter.com/1OD2DQq8D6
— Kiran Parashar (@KiranParashar21) March 17, 2019
బెంగళూరులోని చిక్కోడి తాలుకా కేరూరు గ్రామంలో గుర్రం పందేలను పెట్టారు. అందులో 9ఏళ్ల బాలుడు తన అశ్వాన్ని పరుగులు పెట్టించాడు. అయితే అనుకోకుండా మధ్యలో గుర్రంతో సహా కిందపడ్డాడు బాలుడు. ఆ సమయంలో అతడికి తృటిలో ప్రమాదం తప్పింది. వెంటనే లేచిన గుర్రం ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా పరుగును ప్రారంభించింది. ఇక ఆ బాలుడు కూడా బైక్ సహాయంతో సినిమాలోలాగా గుర్రాన్ని అందుకొని రేస్‌లో విజయం సాధించాడు. కిరణ్ పరాష్కర్ అనే నెటిజన్ పెట్టిన ఈ వీడియో వైరల్ అవ్వగా.. బాలుడి ధైర్యానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.