Viral Video: వయస్సుదేముంది బాస్ కేవలం అది ఒక సంఖ్య మాత్రమే.. 80 ఏళ్ల వయస్సులో బామ్మ రాకింగ్..

|

Jan 29, 2023 | 12:31 PM

వృద్ధాప్యంలో అనేక రకాల అనారోగ్య ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఆరోగ్యంగా ఉన్నా.. శరీరం సహకరించదు.. శరీరం సహకరించినా శక్తి ఉండదు.. ఇలా ఎన్నో సమస్యలు వృద్ధాప్యంలో కనిపిస్తుంటాయి.

Viral Video: వయస్సుదేముంది బాస్ కేవలం అది ఒక సంఖ్య మాత్రమే.. 80 ఏళ్ల వయస్సులో బామ్మ రాకింగ్..
Viral Video
Follow us on

వృద్ధాప్యంలో అనేక రకాల అనారోగ్య ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఆరోగ్యంగా ఉన్నా.. శరీరం సహకరించదు.. శరీరం సహకరించినా శక్తి ఉండదు.. ఇలా ఎన్నో సమస్యలు వృద్ధాప్యంలో కనిపిస్తుంటాయి. అయితే, ఎంత వయస్సొచ్చినా.. కొంత మంది వ్యక్తులు వారు అనుకున్నట్లు జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతుంటారు. డ్యాన్స్ చేయడం, వాకింగ్, సైక్లింగ్, టీవీ చూడటం.. పాటలు పాడటం ఇలా ఏదో ఒకటి చేస్తూ జీవితాన్ని ఆనందిస్తుంటారు. అందుకే చాలామంది పెద్దవాళ్లు వయస్సుదేముంది బాస్.. కేవలం అది ఒక సంఖ్య మాత్రమే అంటూ పేర్కొంటుంటారు. తాజాగా.. ఓ 80 ఏళ్ల బామ్మ.. అచ్చం యువతిలానే పారాగ్లైడింగ్‌ చేసి ఆనందించింది. ప్రస్తుతం బామ్మ పారాగ్లైడింగ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ఆమె పట్టుదలకు, ఆనందానికి సెల్యూట్ చేస్తున్నారు.

ఈ వైరల్ వీడియోను celinamoses అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా.. లక్షలాది మంది వీక్షించి పలు కామెంట్లు చేస్తున్నారు. దాదాపు 4 మిలియన్లకు పైగా లైక్‌లు వచ్చాయంటే ఈ వీడియో ఎంత వైరల్ అవుతుందో చెప్పక్కర్లేదు. వీడియో క్లిప్ పాతదే అయినప్పటికీ తాజాగా వైరల్ అవుతోంది. అయితే.. విషాదకర సంఘటన ఏమిటంటే అందులో ఉన్న మహిళ చనిపోయింది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..


ఈ మేరకు సెలీనా మోసెస్ వీడియోను షేర్ చేస్తూ క్యాప్షన్ రాసింది. “వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే.. ఆమె దీనిని నిరూపించింది. మా అమ్మమ్మ తన 80 సంవత్సరాల వయస్సులో ఇలా చేసింది.. చాలా కాలం తర్వాత నా గ్యాలరీలో ఈ వీడియో కనుగొని.. షేర్ చేయకుండా ఉండలేకపోయాను.. బామ్మ లోకాన్ని వీడి 7 సంవత్సరాలు అయింది. ఆమె ఎప్పటికీ మా హృదయాలలో గుర్తుండిపోతుంది … మిస్ యు. లవ్ యు” అంటూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

వృద్ధురాలు సాహసోపేతమైన పారా గ్లైడింగ్ చేస్తూ.. వీడియోలో ప్రశాంతంగా కనిపిస్తోంది. ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ.. బామ్మను కొనియాడుతున్నారు. ప్రేరణ, పరిపూర్ణత, సరళత, ధైర్యం, శక్తికి నిదర్శనం ఈ బామ్మ అంటూ పేర్కొంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..