AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాషింగ్‌ మెషీన్‌లో వింత శబ్ధాలు.. ఏంటా అని లోతుగా చూస్తే 7అడుగులుంది..?!

ఇంట్లో సాధారణంగా చేసే పనుల్లో బట్టలు ఉతకడం కూడా ఒకటి. కానీ, మధ్యప్రదేశ్‌లోని ఒక కుటుంబానికి ఈ సాధారణ పని ఊహించని భయానక అనుభవాన్ని మిగిల్చింది. ఇంట్లో బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషీన్‌ దగ్గరకు వెళ్లిన మహిళలకు అక్కడ ఎదురైన దృశ్యం చూసి గుండె ఆగినంత పనైంది. వాషింగ్ మెషీన్ లోపల ఒక భారీ పాము ప్రత్యక్షం కావడంతో ఆ కుటుంబం భయంతో వణికిపోయింది.

వాషింగ్‌ మెషీన్‌లో వింత శబ్ధాలు.. ఏంటా అని లోతుగా చూస్తే 7అడుగులుంది..?!
Snake In Washing Machine
Jyothi Gadda
|

Updated on: Oct 14, 2026 | 9:05 PM

Share

మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. ఇంట్లో సాధారణంగా బట్టలు ఉతకడానికి సిద్ధమైన మహిళలు వాషింగ్ మెషీన్ మూత తెరవగా, లోపల పైపుపై ఒక భారీ పాము కనిపించడంతో హడలిపోయారు. రోజూలాగే, ఇంట్లోని మహిళలు బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషీన్ మూతను తెరిచారు. సరిగ్గా మెషీన్ లోపల పైపుపై సుమారు 7 అడుగుల పొడవున్న ఒక పెద్ద పాము చుట్టుకుని కూర్చొని ఉండటాన్ని వారు గమనించారు. ఒక్కసారిగా ఆ దృశ్యాన్ని చూసి కంగుతిన్న వారు, వెంటనే తేరుకుని భయంతో మెషీన్ మూతను మళ్లీ మూసివేశారు. ఆ తర్వాత వెంటనే స్థానిక పాముల రక్షకుడికి సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన రెస్‌క్యూ నిపుణుడు

సమాచారం అందుకున్న వెంటనే పాములు పట్టే నిపుణుడు ప్రవీణ్ తివారీ ఆ ఇంటికి చేరుకున్నారు. వాషింగ్ మెషీన్ ను పరిశీలించి, ఎంతో జాగ్రత్తగా కర్ర సహాయంతో ఆ పామును బయటకు లాగారు. ఆ తర్వాత తన చేతులతో ఆ సరీసృపాన్ని సురక్షితంగా పట్టుకున్నారు. ఆ పామును పరిశీలించిన ఆయన, అది ఏడు అడుగుల పొడవున్న ధామన్ జాతికి చెందినదని గుర్తించారు.

పామును చూసి కుటుంబ సభ్యులు తీవ్రంగా భయపడటంతో, ఇది విషం లేని పాము అని, దాని రంగు, పరిమాణం చూసి ప్రజలు సాధారణంగా భయపడతారని నిపుణుడు వారికి సర్దిచెప్పి ధైర్యం చెప్పారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ పామును విజయవంతంగా బంధించిన రెస్‌క్యూ సిబ్బంది, ఆ తర్వాత దానిని జనసంచారం లేని దట్టమైన అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.

ఇవి కూడా చదవండి

ఇళ్లల్లోకి ఇలాంటి వన్యప్రాణులు, పాములు రాకుండా ఉండేందుకు ఇళ్ల చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతైనా అవసరమని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. ఏదేమైనప్పటికీ, వాషింగ్ మెషీన్ వంటి గృహోపకరణాల వద్ద ఇలాంటి జీవాలు ప్రత్యక్షం కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us