Viral: కారు ఇంజిన్‌లో ఏదో కదులుతూ కనిపించింది.. ఏంటా అని దగ్గరికి వెళ్లి చూడగా..

|

Sep 18, 2024 | 6:41 PM

ఆ వ్యక్తి తన కారును సర్వీసింగ్ చేసేందుకు సెంటర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ పార్క్ చేసి.. కారును చెక్ చేస్తుండగా.. ఇంజిన్‌లో ఏదో కదులుతూ కనిపించింది. ఏంటా అని పరీక్షగా చూడగా....

Viral: కారు ఇంజిన్‌లో ఏదో కదులుతూ కనిపించింది.. ఏంటా అని దగ్గరికి వెళ్లి చూడగా..
Car Engine (Representative image)
Follow us on

ప్రజంట్ వర్షాకాలం నడుస్తోంది. పలు ప్రాంతాల్లో వరదలు బీభత్యం సృష్టిస్తున్నాయి. ఆ వరదల్లో పాములు వంటివి కొట్టుకొస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. పాములు ఇళ్లలోకి దూరి ఎక్కడైనా నక్కే చాన్స్ ఉంటుంది. మీ బైక్స్, కారుల్లో, షూలలో, బీరువాల్లో.. ఇలా ఎక్కడైనా అవి సేదతీరుతూ ఉండవచ్చు. అందుకే అప్రమత్తత అవసరం. తాజాగా ఒరిస్సాలోని జైపూర్ జిల్లా  కొరేయ్ బ్లాక్ పరిధిలోని టెంటులిఖుంట గ్రామంలో సోమవారం తన కారు ఇంజిన్‌లో భారీ కొండచిలువను గుర్తించిన వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. జాజ్‌పూర్ రోడ్డు సమీపంలోని ఓ సెంటర్‌లో సర్వీసింగ్ కోసం వాహనాన్ని తీసుకెళ్లినప్పుడు కారు యజమాని మొదట కొండచిలువ తోకను గమనించాడు. కారు యజమాని వెంటనే స్థానిక స్నేక్ హెల్ప్‌లైన్ సభ్యుడిని సంప్రదించి పామును రెస్క్యూ చేయాల్సిందిగా కోరాడు. దీంతో వెంటనే స్నేక్ క్యాచర్ స్పాట్‌కు చేరుకుని.. పాముని బయటకు తీసి..  జాజ్‌పూర్ రోడ్ అటవీ శాఖ అధికారులకు అప్పగించాడు. వారు దాన్ని తిరిగి సమీపంలోని అడవిలోకి విడిచిపెట్టారు.

కారు ఇంజిన్‌లో పాము చుట్టుకుపోయిందని.. దాన్ని మూడు గంటలపాటు శ్రమించి బయటకు తీసినట్లు స్నేక్ క్యాచర్ వెల్లడించాడు. అది కొండచిలువ అని.. దాదాపు 7 అడుగులు ఉంటుందన్నాడు. ఇలా కార్స్, బైక్స్ వంటి వాహనాల్లో పాములు నక్కి ఉండటం ఇది తొలిసారి ఏం కాదు. అందుకే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అనేది.

Python

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..